'ఘాటి ' రివ్యూ : అనుష్క నటించిన సినిమా ఎలా ఉందంటే..?

దర్శకుడు క్రిష్, నటి అనుష్క కాంబినేషన్ లో తెరకెక్కిన 'ఘాటి' చిత్రం, ఓడిశా-ఆంధ్రా సరిహద్దుల్లోని గంజాయి మాఫియా ప్రపంచంలోకి మనల్ని తీసుకెళ్తుంది. ఈ చిత్ర కథ, ఈస్ట్ గోదావరిలోని కొండ ప్రాంతాల్లో ఉండే 'ఘాటీల' (గంజాయి కూలీలు) జీవితం చుట్టూ తిరుగుతుంది. టీజర్, ట్రైలర్ ఆకట్టుకోవడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకున్నాయి. శుక్రవారం ప్రేక్షకులు ముందుకొచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈ సమీక్ష ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

కథ & విశ్లేషణ
కుందల నాయుడు (చైతన్య రావు) , కష్టాల నాయుడు (రవీంద్ర విజయ్) అనే ఇద్దరు సోదరులు నడిపే గంజాయి సామ్రాజ్యంపై ఈ కథ మొదలవుతుంది. వారి అన్యాయాలను సహించలేని బస్ కండక్టర్ శీలావతి (అనుష్క శెట్టి) డాక్టర్ దేశీ రాజు (విక్రమ్ ప్రభు) గంజాయి మాఫియాలో అడుగుపెడతారు. ఘాటీల తిరుగుబాటును అడ్డుకునేందుకు నాయుడు ఫ్యామిలీ, శీలావతి ,దేశీ రాజులపై పగ తీర్చుకోవాలని చూస్తుంది. శీలావతి మరియు దేశీ రాజు పెళ్లి రోజున కుందల, కష్టాల నాయుడు వారిపై దాడికి ప్లాన్ చేస్తారు. ఈ దాడి తరువాత శీలావతి ఎలా స్పందించింది, ఆమె తన ప్రియుడి లక్ష్యాన్ని ఎలా పూర్తి చేసింది, గంజాయి వ్యాపారాన్ని ఎందుకు వదిలిపెట్టాలనుకుంటుంది అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.

Ghaati Movie Review How Did Anushka s Performance Fare Public Opinion Explored

దర్శకుడు క్రిష్ కథను ఆసక్తికరంగా మొదలుపెట్టినా, మొదటి సగంలో కథనం చాలా నెమ్మదిగా సాగిందనే భావన కలుగుతుంది. అయితే, రెండవ సగంలో శీలావతి పాత్ర శక్తివంతంగా మారడంతో సినిమా పుంజుకుంటుంది. క్లైమాక్స్ ఎపిసోడ్‌ను మరింత మెరుగ్గా తీర్చిదిద్దే అవకాశం ఉన్నప్పటికీ, మొత్తం మీద సినిమా ఒక మంచి యాక్షన్ డ్రామాగా నిలుస్తుంది.

ఫర్ఫామెన్స్
ఈ సినిమాకు ప్రధాన బలం అనుష్క శెట్టి. శీలావతి పాత్రలో ఆమె అద్భుతంగా నటించి, సినిమా భారాన్ని తన భుజాలపై మోసింది. యాక్షన్ మరియు ఎమోషనల్ సన్నివేశాలలో ఆమె నటన ప్రశంసనీయం. విక్రమ్ ప్రభు తన పాత్రకు న్యాయం చేశారు. విలన్‌గా చైతన్య రావు క్యారెక్టర్ ఈ సినిమాలో ఒక సర్‌ప్రైజ్ ఎలిమెంట్. అతను పూర్తి స్థాయి విలనిజాన్ని పండించడమే కాకుండా, అనుష్కతో పోటీ పడి నటించాడు. జగపతి బాబు, జాన్ విజయ్ వంటి నటీనటులు తమ పాత్రలలో మెప్పించారు.

సాంకేతిక అంశాలు
విద్యాసాగర్ అందించిన నేపథ్య సంగీతం సినిమాలోని సన్నివేశాలకు మరింత పవర్ జోడించింది. తోట తరణి ఆర్ట్ వర్క్ , మనోజ్ రెడ్డి సినిమాటోగ్రఫీ సినిమాను మరింత రిచ్‌గా చూపించాయి. కొన్ని సన్నివేశాల్లో సాయి మాధవ్ బుర్రా సంభాషణలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ఫైనల్‌గా
'ఘాటి' సినిమా అనుష్క శెట్టి నటన, యాక్షన్ సన్నివేశాలు మరియు కొత్త నేపథ్యంతో ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇస్తుంది. అయితే, స్క్రీన్‌ప్లే మరియు నిడివి సినిమాకు ప్రతికూల అంశాలు. క్రిష్ మరింత దృష్టి పెట్టి ఉంటే ఇది అనుష్క కెరీర్‌లో ఒక బెస్ట్ సినిమా అయ్యేదనిపిస్తుంది. భారీ అంచనాలు లేకుండా వెళ్లేవారికి ఈ సినిమా మంచి ఎంటర్‌టైనర్.

నటీనటులు: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు, చైతన్య రావు, రవింద్ర విజయ్, జగపతి బాబు, జాన్ విజయ్, రాజు సుందరం తదితరులు
దర్శకత్వం: క్రిష్ జాగర్లమూడి
నిర్మాతలు: రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి
సమర్పణ: యూవీ క్రియేషన్స్
బ్యానర్: ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్
సినిమాటోగ్రఫి: మనోజ్ రెడ్డి కాటసాని
ఆర్ట్: తోట తరణి
మ్యూజిక్: విద్యాసాగర్ నాగవెల్లి
డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా
కథ: చింతకింది శ్రీనివాస రావు
ఎడిటర్: చాణక్యరెడ్డి, వెంకట్ ఎన్ స్వామి
రేటింగ్:2.75/5

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+