సూపర్ స్టార్ మనవడు మాస్ ఎంట్రీ.. 'శ్రీనివాస మంగాపురం' యాక్షన్‌ గ్లింప్స్‌ అదిరింది

టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ జయంతిని పురస్కరించుకుని 'శ్రీనివాస మంగాపురం' చిత్రం నుంచి యాక్షన్‌ గ్లింప్స్‌ రిలీజ్ అయింది. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, రమేశ్ బాబు తనయుడు జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సినిమా కావడంతో ఘట్టమనేని ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీకి 'ఆర్ ఎక్స్ 100', మంగళవారం లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను తెరకెక్కించిన అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని అశ్వినీదత్ సమర్పణలో జెమిని కిరణ్ నిర్మిస్తున్నారు. తాజాగా విడుదలైన యాక్షన్ గ్లింప్స్ ఆకట్టుకుంటోంది.

ఈ యాక్షన్ గ్లింప్స్ లో జయకృష్ణ స్క్రీన్ ప్రెజెన్స్, ఇంటెన్స్ రగ్గ్ డ్ లుక్, పవర్ ఫుల్ ఫైట్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ యాక్షన్ గ్లింప్స్ తో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ నటి రవీనా టాండన్ కుమార్తె రషా థడానీ తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం అవుతోంది. అలాగే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఈ మూవీలో ఓ పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీకి మ్యూజిక్ ప్రధాన బలం అని తెలుస్తోంది. జీవీ ప్రకాశ్ కుమార్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ పెద్ద హిట్ అయ్యాయి.

Ghattamaneni Jayakrishna s Stunning Srinivasa Mangapuram Action Glimpse Capture Mass Entry viral

ఇక ఘట్టమనేని కుటుంబానికి, వైజయంతి మూవీస్ కు దశాబ్దాల నాటి సెంటిమెంట్ ఉన్న సంగతి తెలిసిందే. వైజయంతి బ్యానర్ లో ఘట్టమనేని హీరోలు బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టారు. గతంలో కృష్ణతో అగ్ని పర్వతం, మహేశ్ బాబుతో రాజకుమారుడు లాంటి ఇండస్ట్రీ హిట్స్ కొట్టారు నిర్మాత అశ్వినీదత్. ఇప్పుడు మూడో తరానికి చెందిన జయకృష్ణను పరిచయం చేస్తుండటం విశేషం. అలాగే రెండు విభిన్నమైన నేపథ్యాలతో, సాంకేతికంగా అత్యున్నత ప్రమాణాలతో తెరకెక్కిన ఈ మూవీ జూలై 9, 2026 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+