"యష్" బర్త్ డే గిఫ్ట్‌గా "టాక్సిక్" గ్లింప్స్.. అరాచకానికి పీక్స్ !!

కన్నడ స్టార్ హీరో యష్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ "టాక్సిక్". ఏ ఫెయిరీ టేల్‌ ఫర్‌ గ్రోన్‌ అప్స్‌.. అనే ట్యాగ్‌లైన్ తో రాబోతున్న ఈ చిత్రాన్ని గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో కియారా అద్వానీ, నయనతార, రుక్మిణీ వసంత్, హ్యూమా ఖురేషి, తారా సుతారియా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. KGF సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు ఈ స్టార్ హీరో. అంతే కాకుండా బాక్సాఫీస్ వద్ద కూడా కలెక్షన్స్ సునామీ సృష్టించారు. రాఖీ భాయ్ పేరును ఇండియా వైడ్ గా రీ సౌండ్ వచ్చేలా చేశారు.

ఈ క్రమంలోనే ఆ సిరీస్ తర్వాత దాదాపు ఐదేళ్ల విరామం తీసుకొని మళ్లీ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవ్వడంతో.. ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 2026 మార్చి 19 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న తరుణంలో మూవీ యూనిట్ ప్రమోషన్స్ షురూ చేసింది. ఇప్పటికే నటీమణుల పాత్రల పోస్టర్స్ ఒక్కొక్కటిగా రిలీజ్ చేసి మూవీపై అంచనాలను భారీగా పెంచేశారు. కాగా నేడు యష్ బర్త్ డే కానుకగా టాక్సిక్ నుంచి ఆయన పాత్రకు సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు. అరాచకానికి కూడా నెక్స్ట్ లెవెల్ అనేలా ఉన్న ఈ గ్లింప్స్ వీడియో నెట్టింట ట్రెండింగ్ గా మారింది.

glimpse-video-released-from-kannada-star-hero-yash-toxic-movie

వీడియో ఎలా ఉందంటే..?

అభిమానులను కూడా విపరీతంగా ఆకట్టుకుంటోంది ఈ వీడియో. వీడియో ప్రారంభంలో స్మశానంలో ఒక మాఫియా డాన్ తన కుమారుడి దహన సంస్కారాలు నిర్వహిస్తుండగా.. రాయ (యష్) కారులో ఎంట్రీ ఇవ్వడం చూడవచ్చు. ఆ తర్వాత ఓవైపు కారులో అమ్మాయితో రొమాన్స్.. మరోవైపు గ్యాంగ్ తో యాక్షన్ సీక్వెన్స్ కలిపి అదరగొట్టాడు. చివరిగా తన స్టైల్లో 'డాడీ ఈజ్ హోమ్' అంటూ వచ్చిన ఈ వీడియో ఫుల్ క్రేజీగా ఉందని చెప్పాలి. స్టైలిష్ ప్రెజెంటేషన్, యష్ పవర్ ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌.. రవి బస్రూర్ సంగీతం ఆకట్టుకున్నాయి. లేడీ డైరెక్టర్ అయినప్పటికీ తగ్గేదే లేదంటూ హాలీవుడ్ లెవెల్ మేకింగ్ చూపించారంటూ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

అయితే మేకింగ్ కొంచెం కెజిఎఫ్ లాగే అనిపిస్తుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అంతే కాకుండా కారులో రొమాన్స్.. బాంబులు పేలడం విషయంలో ట్రోల్స్ వస్తున్నాయి. మొత్తంగా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లోనే కాకుండా యూట్యూబ్ లో కూడా ట్రెండింగ్ గా దూసుకుపోతుంది. ఇక ఈ మూవీ రిలీజ్ డేట్ విషయంలో పాజిటివ్ బజ్ నెలకొంది. అటు ఉగాది, గుడి పడ్వా, ఈద్ పండుగలతో పాటు వీకెండ్‌ కూడా కలిసి వస్తుందని అంటున్నారు. ఈ మూవీతో యష్ మరోసారి బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ రాబట్టడం ఖాయమని అంచనా వేస్తున్నారు.

మరోవైపు యష్ బాలీవుడ్‌లో నితీశ్ తివారీ తెరకెక్కిస్తున్న రామాయణంలో "రావణుడి" పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్నారు. అలానే సన్నీ డియోల్, రకుల్, లారా దత్తా సహా పలువురు నటీనటులు నటిస్తున్నారు. ఈ మూవీ రెండు భాగాలుగా రానుండగా.. మొదటి భాగాన్ని 2026 దీపావళికి గ్రాండ్ గా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. రెండవ భాగాన్ని 2027 దీపావళికి రిలీజ్ చేస్తారని టాక్ నడుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+