సినీ ఇండస్ట్రీలో రామ్ చరణ్ ఒక్కడే.. మరో అరుదైన ఘనత !!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరో అరుదైన ఘనత సాధించారు. భారత్‌లో తొలిసారిగా జరగబోతున్న ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌ రామ్ చరణ్ ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియామకం అయ్యారు. ఈ విషయాన్ని జాతీయ ఆర్చరీ అసోసియేషన్‌ (AAI) అధికారికంగా ప్రకటించింది. ఈ తొలి ఎడిషన్ అక్టోబర్ 2 నుంచి 12, 2025 వరకు న్యూఢిల్లీలోని యమునా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ వేదికగా జరగనుంది.

ఈ లీగ్‌లో మొత్తం ఆరు ఫ్రాంచైజీల్లో 36 మంది భారత టాప్‌ ఆర్చర్లతో సహా 12 మంది అంతర్జాతీయ ఆర్చర్లు పోటీపడనున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా డైనమిక్‌ ఫార్మాట్‌ ద్వారా ఆర్చర్లు రికర్వ్‌, కాంపౌండ్‌ విభాగాల్లో పోటీ జరగనుంది. కాగా ఫ్రాంచైజీ ఆధారిత లీగ్‌గా జరుగబోతున్న టోర్నీలో ఆతిథ్య భారత్‌ లోని పురుష, మహిళా కాంపౌండ్‌, రికర్వ్‌ ఆర్చర్లతో పాటు వివిధ దేశాల ఆర్చర్లను ఒక చోట చేరుస్తున్నారు. ఈ వేదిక ద్వారా దేశీయ ఆర్చరీకి అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడమే ధ్యేయంగా లీగ్‌ నిర్వాహకులు పేర్నొన్నారు.

global-star-ram-charan-brand-ambassador-of-the-archery-premier-league

ఈ సందర్భంగా రామ్‌ చరణ్‌ మాట్లాడుతూ.. ఆర్చరీ అనే క్రీడ..క్రమశిక్షణ, ఫోకస్‌, స్థితిస్థాపకతను కలిగి ఉంటుందన్నారు. ఆర్చరీ ప్రీమియర్‌ లీగ్‌లో కలిసి కొనసాగడం గర్వంగా ఉందని.. భారత ఆర్చర్లకు అంతర్జాతీయ వేదిక కావడమే కాదు గ్లోబల్‌ స్పాట్‌లైట్‌లో మెరిసే అవకాశం కల్పిస్తుందన్నారు. భవిష్యత్‌ అథ్లెట్లకు స్ఫూర్తిగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నానని చరణ్ పేర్కొన్నారు.

ఇక జాతీయ ఆర్చరీ అసోసియేషన్‌ అధ్యక్షుడు అర్జున్‌ ముండా స్పందిస్తూ .. దేశంలోని వివిధ గ్రామాల్లో ఉన్న ఆర్చర్లకు ప్రతిభ నిరూపించుకునేందుకు ఏపీఎల్‌ వేదికగా ఉపయోగపడనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రామ్‌చరణ్‌ బ్రాండ్‌ అంబాసీడర్‌గా దేశంలోని మరింత మంది యువత ఆర్చరీ పట్ల ఆకర్షితమయ్యేందుకు ఆస్కారం ఉంటుందని అన్నారు.

ఈ టోర్నమెంట్ గ్లోబల్ స్థాయిలో ప్రత్యేకతను సంపాదించబోతోందని నిర్వాహకులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి భారత్‌లో తొలిసారి జరగబోతున్న ఆర్చరీ ప్రీమియర్ లీగ్, రామ్ చరణ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండటం వల్ల మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.

మరోవైపు చరణ్‌ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'పెద్ది'. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో.. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. జగపతిబాబు, కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, బాలీవుడ్ నటుడు దివ్యేండు సహా పలువురు నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత మ్యూజిక్ డైరెక్టర్​ ఏఆర్‌ రెహమాన్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్‌ రైటింగ్స్‌ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కాబోతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+