అట్టర్ ఫ్లాప్ టాక్‌తో రూ.440 కోట్లు రాబట్టిన తెలుగు స్టార్ హీరో
ఈరోజుల్లో హీరోయిజం అనేది, పరిశ్రమలో నెంబర్ వన్ ఎవరు అనేది వారు చేసే సినిమాలనుబట్టి, అభిమానులబట్టి, సినిమాల బడ్జెట్ ను బట్టి నిర్ణయించడంలేదు. బాక్సాఫీస్ దగ్గర ఎవరు ఎక్కువ కలెక్షన్లు సాధిస్తే వారే నెంబర్ వన్ హీరో అవుతారు. ఆ తర్వాత మరో హీరో వచ్చి ఎక్కువ కలెక్షన్లు రాబడితే అక్కడి నుంచి ఆ హీరో నెంబర్ వన్ గా చెలామణి అవుతాడు. అది ఆయా హీరోలకు ఉన్న స్టార్ ఇమేజ్, అభిమానుల క్రేజ్ పై ఆధారపడివుంటుంది. సినిమా ఫ్లాప్ అయినా సరే తమకున్న స్టామినాతో, క్రేజ్ తో వాటిని నష్టాల బారి నుంచి కాపాడే హీరోలు కూడా ఉన్నారు. లాభాలు రాకపోయినా కనీసం పెట్టిన పెట్టుబడి వచ్చేలా, నష్టాలు రాకుండా చూసే హీరోలున్నారు.
మొదటిరోజు మొదటి ఆట నుంచే చెత్త టాక్
అటువంటి హీరోల్లో తమిళ దళపతి విజయ్ ఒకరు. కొన్ని సంవత్సరాల నుంచి తమిళంలో స్టార్ హీరోగా చెలామణి అవుతూ దేశవ్యాప్తంగా తన మార్కెట్ పరిధిని పెంచుకున్నాడు. ఈ హీరో మరో సినిమా చేసి రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారు. ఇటీవలే విజయ్ గోట్ సినిమా చేశారు. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనేది దీని పూర్తిపేరు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో స్నేహ, మీనాక్షి చౌదరితోపాటు ప్రభుదేవా, ప్రశాంత్ తదితరులు నటించారు. విజయ్ ద్విపాత్రాభినయం చేశారు. సినిమా విడుదలైన మొదటిరోజు మొదటి ఆట నుంచే ఫ్లాప్ టాక్ మూటకట్టుకుంది. అయినప్పటికీ ఈ సినిమా లాంగ్ రన్ లో రూ.440 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి శభాష్ అనిపించింది.

నాగచైతన్యకు కస్టడీ పేరుతో అట్టర్ ఫ్లాప్ ఇచ్చాడు
సినిమా విడుదలైనరోజు అతి చెత్త సినిమా అని తేల్చేశారు. దీన్ని విజయ్ ఎలా ఒప్పుకున్నాడని రివ్యూవర్లు ప్రశ్నించారు. చివరకు అట్టర్ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. అయినా థియేటర్లలో స్టడీగా కలెక్షన్లు రాబట్టిందంటే దానికి విజయ్ కు ఉన్న అభిమానుల బలం అని చెప్పొచ్చు. స్క్రీన్ ప్లేతో ఎప్పుడూ మ్యాజిక్ చేసే వెంకట్ ప్రభు ఈ సినిమాకు ముందు నాగచైతన్యతో కస్టడీ సినిమా చేసి తనకు కూడా అట్టర్ ప్లాప్ ఇచ్చాడు. అయినప్పటికీ అతనిమీద నమ్మకంతో విజయ్ అవకాశం ఇవ్వగా అతి చెత్త సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఈ సినిమా తర్వాత విజయ్ తమిళంలో చేసేది చివరి సినిమా అవుతోంది. తెలుగులో బాలయ్య నటించిన భగవంత్ కేసరి సినిమాను రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications