నందమూరి బాలకృష్ణ, మోక్షజ్ఞ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్
నందమూరి మోక్షజ్ఞ సినీరంగ ప్రవేశం ఎప్పుడా? అని బాలయ్య అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసేవారు. ఒకానొక దశలో అతను సినీ పరిశ్రమకు రాడు అని కూడా ఫిక్సయిపోయారు. అంతగా ఎదురు చూశారు. తాజాగా మోక్షజ్ఞ సినీ ప్రవేశం గురించి దసరా పర్వదినాన శుభవార్త రాబోతోంది. మోక్షజ్ఞ మొదటి సినిమాకు దర్శకుడు ఎవరు? నిర్మాత ఎవరు? సంగీత దర్శకత్వం ఎవరు? మొదటి సినిమాకు హీరోయిన్ ఎవరు?.. తదితర ప్రశ్నలకు సమాధానం దొరకబోతోంది.
శ్రీలీల అంటూ వార్తలు : మోక్షజ్ఞకు జోడీగా శ్రీలీల నటించే అవకాశం ఉందని ఒక వార్త సోషల్ మీడియాతోపాటు తెలుగు ఫిల్మ్ నగర్ లో హల్ చల్ చేస్తోంది. దీనికి సంబంధించిన వాస్తవ ప్రకటన రావాల్సి ఉంది. భగవంత్ కేసరి సినిమా విడుదల సమయంలో నందమూరి ఫ్యాన్స్ కు మరో తీపికబురు అంటూ వార్తలు వస్తున్నాయి. అఖండ, వీరసింహారెడ్డి లాంటి సినిమాలతో వరుస విజయాలు సాధిస్తూ.. భగవంత్ కేసరితో మరో సూపర్ హిట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్న బాలయ్య మోక్షజ్ఞ కెరీర్ కూడా అలాగే ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

పాన్ ఇండియా స్థాయిలో : నందమూరి మోక్షజ్ఞ (Mokshagna) మొదటి సినిమా సొంత బ్యానర్ లో తెరకెక్కే అవకాశం ఉందంటున్నారు. తొలి సినిమాతోనే పాన్ ఇండియా రేంజ్ లో పరిశ్రమను షేక్ చేయనున్నారని, మాస్, యాక్షన్ ప్రేక్షకులను అలరించేలా సినిమా ఉండబోతోందంటూ కామెంట్లు వస్తున్నాయి. అలాగే మోక్షజ్ఞ తొలి సినిమాలో బాలయ్య కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.
అన్ని భాషల్లో : ఇప్పటికే తన లుక్ ను మార్చుకున్న మోక్షజ్ఞ వరుసగా సినిమాలలో నటించేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మోక్షజ్ఞ రేంజ్ రాబోయే రోజుల్లో మరింత పెరగాలని, సినిమా సినిమాకు పెరుగుతూ వెళ్లాలని అభిమానులు కోరుకుంటున్నారు. పాన్ ఇండియా రేంజ్ డైరెక్టర్లు మోక్షజ్ఞపై దృష్టి పెడతారంటున్నారు. మోక్షజ్ఞ తన సినిమాలు ఇతర భాషల్లో సైతం విజయం సాధించేలా ప్లాన్ చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ లో వినపడుతోంది.












Click it and Unblock the Notifications