గుడ్‌న్యూస్ చెప్పిన సమంత... 6 నెలల్లో..!
దక్షిణాది బ్యూటీ సమంత రెండు సంవత్సరాల నుంచి ఒక్క సినిమా కూడా చేయలేదు. కానీ భారతదేశంలోనే నెంబర్ వన్ హీరోయిన్ గా నిలుస్తోంది. ప్రతి నెలా బాలీవుడ్ మీడియా ఆర్మాక్స్ విడుదల చేసే జాబితాలో మొదటి స్థానాన్నే దక్కించుకుంటోంది. అలియాభట్, దీపికా పదుకొనే లాంటివారంతా సమంత వెనకాలే ఉంటున్నారు. అంతగా పాపులారిటీని సమంత సంపాదించుకుంది. సినిమాలతోపాటు వెబ్ సిరీస్ లు చేయడమే దీనికి కారణం. నాగచైతన్యకు విడకులిచ్చిన తర్వాత ఇటీవలి కాలం నుంచి ముంబయిలోనే ఎక్కువగా నివసిస్తోంది. హైదరాబాద్ రావడం కూడా తగ్గించేసింది.
ముంబయిలోనే నివసిస్తోన్న సమంత
మయోసైటిస్ కు చికిత్స తీసుకున్న తర్వాత తన సొంత బ్యానరులో మాఇంటి బంగారం పేరుతో సినిమాను ప్రారంభించిందికానీ దీనిపై ఇంతవరకు అప్ డేట్ ఇవ్వలేదు. అలాగే సిటాడెల్ రీమేక్ హనీబన్నీ వెబ్ సిరీస్ విడుదలై మంచి హిట్ అయింది. త్వరలోనే మరో రెండు వెబ్ సిరీస్ లు చేయబోతోంది. ఒక దర్శకుడితో రిలేషన్ షిప్ లో ఉందంటూ పుకార్లు వస్తున్నాయికానీ తనకు రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని గతంలోనే ప్రకటించింది. ఇటీవలే ఆమె తండ్రి మరణించారు. ఆ తర్వాత ఎక్కువగా ముంబయిలోనే నివసిస్తోంది.

ఆరు నెలలు నవ్వుతూనే ఉంటాను
తాజాగా సమంత ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ షేర్ చేసింది. రాబోయే ఆరునెలలు తాను నవ్వుతూనే ఉంటానని రాసింది. తెలుపురంగు టాప్ ధరించి మంచి ఫొటోలు దిగి వాటిని షేర్ చేసింది. దీనిపై నెటిజన్లు బాగున్నాయంటూ కామెంట్లు పెడుతున్నారు. ఎప్పుడూ ఇలా నవ్వుతూనే ఉండాలని కోరుకుంటున్నామంటున్నారు. నాగచైతన్యతో విడిపోకుండా ఉంటే తాము ఇంకా ఆనందంగా ఉండేవారిమని కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ భవిష్యత్తులో సమంత ఏమైనా నిర్ణయం తీసుకుంటుందేమో చూడాలి. ఇటీవలే ఒక సినిమా వేడుకలో పాల్గొని సినిమాల్లో అవకాశాలు రావడంలేదని బహిరంగంగానే చెప్పింది. మయోసైటిస్ చికిత్స కోసం రెండు సంవత్సరాల గ్యాప్ తీసుకోవడంతో... ఆ సమయంలో కొత్త హీరోయిన్లు రావడంతో.. సమంతకు సహజంగానే అవకాశాలు తగ్గిపోయాయి. బాలీవుడ్ లో షారుక్ సరసన, తమిళంలో విజయ్ సరసన అవకాశాలు వచ్చాయంటున్నారుకానీ వాటిపై అధికారికంగా ప్రకటన లేదు.












Click it and Unblock the Notifications