'గోపి గాళ్ల గోవా ట్రిప్'.. టాలీవుడ్ కథకు హాలీవుడ్ టేకింగ్

తెలుగు సినిమా అంటే కేవలం భారీ బడ్జెట్‌లు, స్టార్ హీరోల బిల్డప్‌లే కాదు... ఒక స్వచ్ఛమైన కథ, నిజాయితీగల ప్రయాణం కూడా ప్రేక్షకుల గుండెల్ని తాకగలదు అని నిరూపించింది ఈ కొత్త 'గోపి గాళ్ల గోవా ట్రిప్'సినిమా.

మొదట్లో గోవా కలలు కనే ఇద్దరు పల్లెటూరి కుర్రాళ్ల కథగా కనిపించినా, ఈ చిత్రం నెమ్మదిగా ఓ చిన్నపాటి, మ్యాజికల్ అడ్వెంచర్‌గా మారుతుంది. దర్శకులు దీన్ని చాలా క్లారిటీగా, సింపుల్‌గా తీర్చిదిద్దారు, కథనాన్ని అనవసరపు హంగులతో నింపకుండా, ప్రేక్షకుడికి నేరుగా కనెక్ట్ అయ్యేలా చేశారు.

Gopi Gaalla Goa Trip Review Hollywood Making Meets Telugu Story A Fresh Road Trip Film
ఈ సినిమాలోని అత్యుత్తమ అంశం దాని నిజాయితీ. సింక్ సౌండ్ వాడడం వల్ల, ప్రతి సన్నివేశం మన పక్కనే జరుగుతున్న అనుభూతిని ఇస్తుంది. పాత్రల యాస, రోడ్ల నుంచి వచ్చే శబ్దాలు, టౌన్ల గందరగోళం... అన్నీ కలిసి ఒక లీనమయ్యే అనుభవాన్ని ఇస్తాయి. కథ చెప్పడానికి ప్రత్యేకంగా మాటలు అవసరం లేకుండానే, మనం ఆ పాత్రల మనసుల్లోకి, ఆ ప్రయాణం యొక్క ఫీలింగ్‌లోకి వెళ్లగలం.

సహజత్వంతో కూడిన నటన
నటన విషయానికొస్తే, ఇక్కడ ఓవర్-డ్రామా లేదు, హీరోల బిల్డప్ లేదు. నటీనటులు మన రోజూవారీ ఫ్రెండ్స్‌లాగే చాలా సహజంగా నటించారు. వారి సంభాషణలు కూడా అంతే సహజంగా ఉంటాయి-ఒకరినొకరు కట్ చేసుకుంటూ, జోకులు వేసుకుంటూ, నిజాయితీగా మాట్లాడుకునే తీరు వారి మధ్యనున్న బంధాన్ని బలంగా చూపిస్తుంది.

విజువల్ ట్రీట్
ఈ చిత్రం విజువల్‌గా ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది. కలర్స్ కొంచెం డల్లుగా, మూడీగా, పచ్చిగా ఉండి, కథకు తగ్గ వాతావరణాన్ని సృష్టిస్తాయి. రోడ్ ఫ్రేమ్స్ అద్భుతం, ముఖ్యంగా గోవాలో చిత్రీకరించిన దృశ్యాలు డ్రీమీగా, మ్యాజికల్‌గా చూపించడం ప్రేక్షకుడి కళ్లకు పండుగలా అనిపిస్తుంది.

ఫైనల్‌గా: ఈ సినిమా రెగ్యులర్ కమర్షియల్ 'గోపి గాళ్ల గోవా ట్రిప్' ఫార్ములాను పూర్తిగా పక్కన పెట్టింది. ఇది కేవలం మూడ్, ఫీలింగ్, క్యారెక్టర్స్ మీదే నమ్మకం ఉంచింది. రెగ్యులర్ సినిమాలతో బోర్ కొట్టిన ప్రేక్షకులకు ఇది ఒక అద్భుతమైన ట్రీట్. ధైర్యం చేసి కొత్తదనాన్ని కోరుకునేవారికి, ఈ రోడ్-ట్రిప్ ఖచ్చితంగా నచ్చుతుంది.

రేటింగ్: 2.5/7

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+