2 కోట్లతో సొంతూరులో హాస్పిటల్ కట్టించిన స్టార్ హీరో..!
తెలుగు సినిమా రంగంలో ఆర్. నారాయణ మూర్తికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. నటుడిగా మొదలైన ఆయన ప్రస్థానం అంచెలంచెలుగా ఎదిగి 'పీపుల్స్ స్టార్' గా గుర్తింపు తెచ్చుకున్నారు. బలమైన సందేశాన్ని, పోరాట స్ఫూర్తిని నింపేలా తనదైన శైలిలో సినిమాలు తెరకెక్కించారు. "అర్ధరాత్రి స్వాతంత్య్రం", "లాలూ లాలూ పంజాబీ", "విశ్వరూపం", "దళితోద్ధారణ", "పోరాటం", "చలో ఆంధ్రా", "రైతన్నా" వంటి చిత్రాలను నిర్మించి, నటించారు.
ప్రస్తుతం ఆర్. నారాయణ మూర్తి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన తాజా చిత్రం 'యూనివర్సిటీ (పేపర్ లీక్)'. ఈ మూవీ ఆగస్టు 22న విడుదల కాబోతుంది. విద్యారంగంలో పెచ్చుమీరుతున్న అవినీతి, ప్రశ్న పత్రాల లీక్ వంటి అంశాలను ఈ సినిమాలో ఆయన తీవ్రతతో ప్రజల ముందుకు తీసుకువస్తున్నారు.

ఈ సినిమాకు సంబంధించి నిర్వహించిన ఈవెంట్ లో.. గోరటి వెంకన్న, అద్దంకి దయాకర్, దేశపతి శ్రీనివాస్, అందెశ్రీ వంటి ప్రముఖులు పాల్గొన్నారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ.. నారాయణ మూర్తి లాగా జీవించడం అంటే అసాధ్యం అంటూ కొనియాడారు.
గోరటి వెంకన్న మాట్లాడుతూ.. నారాయణ మూర్తి తన సొంతూరులో రూ. 2 కోట్లు ఖర్చు చేసి ఓ ఆసుపత్రిని నిర్మించి.. దాన్ని నాగం జనార్ధన్ రెడ్డి గారి పేరుతో ప్రజలకు అంకితమిచ్చారని తెలిపారు. ఆసుపత్రికి తన పేరు గానీ, తల్లిదండ్రుల పేరుగానీ పెట్టకుండా తన నిరాడంబరతను చాటుకున్నారన్నారు.
అంతే కాకుండా తన తండ్రి కోరిక మేరకు తన ఊరిలో ఆలయాన్ని కూడా నిర్మించారని వెల్లడించారు. అయితే ఈ విషయాలను ఎప్పుడు బయట చెప్పుకోరని.. ఇదే పీపుల్స్ స్టార్ గొప్పతనం అని వివరించారు. దీంతో ఆయన చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.












Click it and Unblock the Notifications