'దేవర' లో మరో హీరోయిన్.. జాన్వీకన్నా సూపర్!
ఆర్ఆర్ఆర్ చిత్రంతో జూనియర్ ఎన్టీఆర్ గ్లోబల్ హీరోగా మారిపోయారు. ఆయన పోషించిన పాత్ర, అందులోని నటనకు అందరూ ఫిదా అయ్యారు. ఆ సినిమా తర్వాత ఇంతవరకు మరోచిత్రం ఏదీ తారక్ నుంచి విడుదల కాలేదు. కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న దేవర సినిమా ఏప్రిల్ 5వ తేదీనే విడుదల కావాల్సి ఉన్నప్పటికీ అనుకోని కారణాలవల్ల వాయిదా పడింది. ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా చిత్ర యూనిట్ మరో హీరోయిన్ ను ఎంపిక చేసింది. జాన్వీకపూర్ కన్నా ఈ ముద్దుగుమ్మ చాలా బాగుందంటూ తెలుగు ఫిలింనగర్ లో వార్త చక్కర్లు కొడుతోంది.
గుజరాతి నటి, ప్రముఖ సీరియల్ హీరో గౌరవ్ ఘట్టనేకర్ భార్య శృతి మరాఠే మరో హీరోయిన్ గా ఎంపికైంది. ఎన్టీఆర్ పక్కనే ఉండే ఓ ప్రముఖ పాత్రలో ఆమె నటించబోతున్నట్లు సమాచారం. శృతికి సంబంధించిన షెడ్యూల్స్ ను కూడా దేవర యూనిట్ పూర్తిచేసినట్లు తెలుస్తోంది. వాస్తవానికి మరో హీరోయిన్ గా కృతి శెట్టి, మృణాల్ ఠాకూర్ తదితర నటీమణుల పేర్లు షికార్లు చేసినప్పటికీ చివరకు శృతి పేరు ఫైనల్ అవడంతోపాటు ఆమెకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ కూడా జరుగుతోంది.

దేవర సినిమాను పాన్ ఇండియా సినిమాగా విడుదల చేస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడం, మళయాళంతోపాటు హిందీలోను భారీగా విడుదల చేయనున్నారు. దీంతో అంతర్జాతీయగా మరికొన్ని భాషల్లో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ఏర్పాట్లు చేసుకుంటోంది. నందమూరి కల్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ దీన్ని సంయుక్తగా నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ స్వరాలందిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందించడంలో ఆలస్యం జరగడంతోపాటు వీఎఫ్ఎక్స్ వర్క్ కూడా పెండింగ్ లో ఉండటంవల్లే సినిమా వాయిదా పడిందనే వార్తలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications