Guntur Kaaram pre release: గుడ్ న్యూస్: ఛలో గుంటూరు: వెన్యూ ఇదే: హైరేంజ్‌లో అరెంజ్‌మెంట్స్

Guntur kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న తాజా చిత్రం.. గుంటూరు కారం. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తోన్నారు. హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ (చినబాబు) ఈ సినిమాను నిర్మిస్తోన్నారు. థమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ మూవీ జనవరి 12వ తేదీన విడుదల కానుంది.

ఆదివారం విడుదల అయిన ఈ సినిమా ట్రైలర్‌ సినిమాపై మరింత హైప్‌ను క్రియేట్ చేసింది. కొన్ని గంటల వ్యవధిలోనే లక్షలాది వ్యూస్‌ను సొంతం చేసుకుంది. మహేష్ బాబులోని సరికొత్త కోణాన్ని ఆవిష్కరించిందా ట్రైలర్. సాంగ్స్, ఫైట్స్, డైలాగ్స్.. ఇలా అన్నింట్లోనూ వింటేజ్ మహేష్ బాాబు దర్శనం ఇచ్చాడు.

Guntur Kaaram pre release event venue, date and time is here

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ కోసం ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ఈ నెల 9వ తేదీన గుంటూరులో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనుంది సినిమా యూనిట్. మొదట హైదరాబాద్ యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను జరపాలని సినిమా యూనిట్ నిర్ణయించుకున్నప్పటికీ.. అది సాధ్యపడలేదు.

దీనితో- గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గుంటూరుకు షిఫ్ట్ చేశారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని అధికారికంగా ప్రకటించింది. మహేష్ బాబు సొంత జిల్లా కావడం, గుంటూరు టైటిల్‌తో సినిమా తెరకెక్కిన నేపథ్యంలో ఇక్కడైతేనే బాగుంటుందని భావించింది.

ఈ నెల 9వ తేదీన సాయంత్రం 5 గంటల నుంచి ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం ఆరంభమౌతుంది. గుంటూరు సమీపంలోని నంబూరు క్రాస్ రోడ్స్ వద్ద గల భారత్ పెట్రోల్ బంక్ పక్కనే ఉన్న బహిరంగ స్థలంలో గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నట్లు హారికా అండ్ హాసిని సంస్థ ప్రకటించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+