Guntur Karam: ఓటీటీలో రికార్డులు సృష్టిస్తున్న గుంటూరు కారం..!
ఈ సంక్రాంతికి మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా విడుదలైంది. ఈ మూవీ యవరేజ్ గా ఉన్నా.. కలెక్షన్లు మాత్రం బాగానే సాధించింది. అయితే ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. గుంటూరు కారం ఫిబ్రవరి 9 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఓటీటీలో ఈ మూవీని తెగ చూసేస్తున్నారట. ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ నంబర్ 1న గా ట్రెడింగ్ అవుతుందని చెబుతున్నారు. వరల్డ్ వైడ్ గా ఈ మూవీ ట్రెండింగ్ లో ఉన్నట్లు నెట్ ఫ్లిక్స్ వారు పేర్కొంటున్నారు.
ఈ సినిమా విడుదలైనప్పుడు విమర్శకుల నుంచి నెగటివ్ స్పందన వచ్చింది. ఆ తర్వాత క్రమంగా పుంజుకుంది. తాజాగా ఓటీటీలో కూడా ఆధారణ లభిస్తోంది. ఈ మూవీకి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా చేసిన చేసిన శ్రీలీల సంచలన కామెంట్లు చేసింది. ఈ సినిమా సూపర్ హిట్ అని పోస్టర్స్ విడుదల చేశారు శ్రీలీల. దీంతో ఆమె స్నేహితులు మూవీ విజయవంతం అయింది పార్టీ ఇవ్వాలని కోరారట.

దానికి శ్రీలీల బదులిస్తూ.. ఈ మూవీ ఎక్కడ హిట్ అయింది. పబ్లిసిటీ కోసం వంద పోస్టర్స్ వేస్తామని చెప్పారట. దీంతో మహేష్ అభిమానులు శ్రీలలపై మండిపడుతున్నారు. ఈ మూవీ యువరేజ్ గా ఉన్నట్లు సినీ క్రిటిక్స్ చెబుతున్నారు. అయితే ఈ మూవీతో పాటే వచ్చిన హనుమాన్ చిత్రం మాత్రం ఇంకా థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. ఇప్పటికే ఈ మూవీకి రూ.300 కలెక్షన్లు వచ్చినట్లు చెబుతున్నారు. ఇప్పటికి కూడా ఈ చిత్రం థియేటర్లలో నడుస్తుండడంతో కలెక్షన్లు ఇంకా పెరిగే అవకాశం ఉంది.
Guntur Kaaram's SPICY fever is taking over as it is trending #1 on Netflix🌶️🔥
— Netflix India South (@Netflix_INSouth) February 12, 2024
Guntur Kaaram, now streaming in Telugu, Tamil, Malayalam, Kannada and Hindi.#GunturKaaramOnNetflix pic.twitter.com/8HmfmHbRgc
హనుమాన్ చిన్న సినిమాగా వచ్చి.. పెద్ద సినిమా గుంటూరు కారాన్ని ఢీకొట్టింది. ఈ పోరాటంలో హనుమాన్ విజయం సాధించిందని చెప్పుకోవచ్చు. దానికి నిదర్శనం.. ఇంకా హనుమాన్ మూవీ థియేటర్లలో ప్రదర్శితమవుతుండడం. ప్రస్తుతానికి థియేటర్లలో హనుమాన్ సత్తా చాటుతుంటే.. ఓటీటీలో గుంటురు కారం హవా నడుస్తోంది.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications