హైపర్ ఆదిపై హీరోయిన్ ఫైర్..నోరు మూసుకో అంటూ వార్నింగ్
జబర్దస్త్ షోతో హైపర్ ఆది మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. షోలో తనదైనశైలిలో పంచులు వేస్తూ అతి తక్కువ కాలంలోనే ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. జబర్దస్త్ షోలో కంటెస్టెంట్‌గా వచ్చిన ఆది తరువాత టీం లీడర్‌గా ఎదిగాడు. తన స్కిట్‌లను తానే రాసుకొంటూ అందరి దృష్టిని ఆకర్షించాడు. హైపర్‌నే తన ఇంటి పేరు మార్చుకున్న ఆది..తనదైన పంచ్ డైలాగులతో రెచ్చిపోతుంటాడు. జబర్దస్త్‌తో పాటు, ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి ప్రముఖ షోల్లో ఆది సందడి చేస్తుంటాడు.
అయితే ఇదే సమయంలో మనోడుపై తీవ్ర విమర్శలు కూడా వస్తుంటాయి. తన స్కిట్స్‌లో అమ్మాయిలను చులకనగా చూపించడం, వారిపై డబుల్ మీనింగ్ డైలాగులు వాడటం వంటివి చేస్తుంటాడు. దీంతో ఆది విమర్శలకు గట్టి పని కల్పిస్తుంటాడు. ఇదిలా ఉంటే హైపర్ ఆది మెగా అభిమాని అనే అందరికి తెలిసిన విషయమే. ముఖ్యంగా పవన్ కల్యాణ్‌కు హైపర్ ఆది వీరాభిమాని. అవకాశం చిక్కినప్పుడల్లా పవన్‌పై తనకున్న అభిమానాన్ని చూపిస్తుంటాడు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన జనసేన తరుఫున ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు.

హైపర్ ఆది ప్రస్తుతం ఢీ షో చేస్తున్నారు. సీజన్ 1 కి ప్రణీత సుభాష్ జడ్జిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. సీజన్ 2 కోసం యాపిల్ బ్యూటీ హన్సిక రంగంలోకి దించారు యాజమాన్యం.శేఖర్ మాస్టర్ యథావిధిగానే కొనసాగుతున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రొమో విడుదలైంది. ఈ ప్రొమోలో డ్యాన్స్ మాస్టర్ శేఖర్‌పై తనదైన పంచులు వేస్తూ ఆది రెచ్చిపోయాడు. ఢీ షోకు గెస్టులుగా సుధీర్ బాబు రావడం జరిగింది. శేఖర్ మాస్టర్‌కు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది సుధీర్ బాబు కావడంతో..ఆయన సినిమాకు లింక్ చేస్తూ సెటైర్లు వేశాడు ఆది.
హైపర్ ఆది మాట్లాడుతూ.. మీరు ఎస్ఎంఎస్ చిత్రం ఒక్కసారే చేశారు. కానీ శేఖర్ మాస్టర్ కొందరికి ప్రతి రోజు ఎస్ఎంఎస్ చేస్తుంటారు అని సెటైర్ వేశారు. మీ ప్రేమ కథా చిత్రంలో దెయ్యాన్ని చూసి మీరు పారిపోతారు.. కానీ శేఖర్ మాస్టర్ ని చూసి దెయ్యమే పారిపోతుంది అని హైపర్ ఆది మరో పంచ్ వేశాడు. దీనితో కొత్తగా వచ్చిన హన్సిక శేఖర్ మాస్టర్‌కి సపోర్ట్ చేస్తూ హైపర్ ఆదికి వార్నింగ్ ఇచ్చారు. ఏయ్ ఆది. శేఖర్ మాస్టర్ చాలా మంచి వారు.. నీ నోరు మూసుకో అంటూ హన్సిక ఇచ్చిన వార్నింగ్ చాలా ఫన్నీగా ఉంది. మీకు నాలుగు రోజుల తర్వాత ఆయన గురించి అర్థం అవుతుంది చూడండంటూ హన్సికకు హైపర్ ఆది కౌంటరిచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రొమో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
-
ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్ !! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ!












Click it and Unblock the Notifications