ఓటీటీలో అదరగొడుతున్న హారర్ థ్రిల్లర్ ..డోంట్ మిస్

హీరోయిన్ హన్సిక మోత్వానీ ప్రధాన పాత్రలో నటించిన గార్డియన్ ఒక ఉత్కంఠభరితమైన హారర్ థ్రిల్లర్. ఈ సినిమా మిమ్మల్ని భయంతో సీట్ల అంచున కూర్చోబెడుతుంది. కథలోకి వెళితే, ఒక నిర్మాణ సంస్థలో పనిచేసే యువతికి ఒక వింత అనుభవం ఎదురవుతుంది. ఒక వైద్యుడికి తన అనుభవాన్ని వివరిస్తూ, ఆమె ఏమి అనుకుంటే అది జరుగుతోందని చెబుతుంది. ఇది ఆమె కాలికి ఒక మేకు తగిలినప్పటి నుండి మొదలైందని ఆమె గుర్తుచేసుకుంటుంది.

ఆ తర్వాత ఆమె శరీరంలోకి ఒక భయంకరమైన ఆత్మ ప్రవేశిస్తుంది. ఆ ఆత్మ ఆమె ద్వారా తన కోరిక తీర్చుకోవడానికి, తనకు అడ్డు వచ్చిన వారందరినీ చంపడానికి ప్రయత్నిస్తుంది. సినిమాలోని భయానక సన్నివేశాలు మిమ్మల్ని వణికించేలా చేస్తాయి. ఊహించని మలుపులు కథను మరింత ఆసక్తికరంగా మారుస్తాయి. ఫ్లాష్‌బ్యాక్, సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి.

Hansika Motwani s super hit horror thriller Guardian is streaming on Aha

సామ్ సిఎస్ అందించిన సంగీతంలో ఒక పాట మాత్రం చాలా బాగుందని చెప్పవచ్చు. హన్సిక మోత్వానీ తన పాత్రలో ఒదిగిపోయారు, కానీ పోరాట సన్నివేశాలలో ఆమె నటన కొంతవరకు సాధారణంగా ఉందని కొందరు అభిప్రాయపడ్డారు. మొత్తానికి, గార్డియన్ ఒక డీసెంట్ హారర్ థ్రిల్లర్, ఇది భయానక సినిమాలను ఇష్టపడే వారికి ఒకసారి చూడదగిన సినిమా. ప్రస్తుతం ఈ సినిమా తెలుగులో కూడా అందుబాటులోకి వచ్చింది.ఈ హారర్ థ్రిల్లర్ సినిమా ఆహాలో స్ట్రీమింగ్‌ అవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+