బ్రేకప్ చెప్పిన స్టార్ హీరోయిన్- విడాకులు?
ఓ స్టార్ హీరోయిన్.. డివోర్స్ కోసం తీసుకోబోతోందనే ప్రచారం జోరుగా సాగుతోంది. భర్త సోహైల్ ఖతూరియాకు సంబంధించిన వీడియోలు, పెళ్లి ఫొటోలను ఆమె తన అధికారిక ఇన్ స్టాగ్రామ్ ప్లాట్ ఫామ్ నుంచి డిలేట్ చేయడం, అతని అకౌంట్ ను అన్ ఫాలో చేయడం దీనికి కారణం.
ఆమె ఎవరో కాదు.. కోలీవుడ్ లో ఒక వెలుగు వెలిగిన హన్సిక మోత్వానీ. ఫొటోలు, వీడియోలు డిలేట్ చేయడంతో హన్సిక- సొహైల్ ఖతూరియా విడాకులు తీసుకోబోతోన్నారనూ వదంతులు ప్రచారంలోకి వచ్చాయి. చాలావరకు హన్సిక పెళ్లి ఫొటోలు ఆమె ఇన్ స్టా లో కనిపించట్లేదు. అదే సమయంలో ఆమె భర్తకు దూరంగా ఉంటోందని, తల్లితో కలిసి నివసిస్తోందనే ఊహాగానాలు కూడా వ్యక్తమౌతోన్నాయి.

2022 డిసెంబర్‌లో సొహైల్ ఖతూరియాను ప్రేమించి, పెళ్లి చేసుకుంది హన్సిక. ఆమె ప్రేమ వ్యవహారం.. అప్పట్లో 'హన్సిక లవ్ షాదీ డ్రామా' అనే రియాలిటీ సిరీస్‌తో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇది అందరి దృష్టిని ఆకర్షించింది.. పెద్ద ఎత్తున డిబేట్స్ కు కేంద్ర బిందువు అయింది.
దాదాపు మూడు సంవత్సరాల తర్వాత, ఇప్పుడు వారి వెడ్డింగ్ కు సంబంధించిన పోస్ట్‌లు చాలా వరకు కనిపించకుండా పోయాయి. జూలై 18 తర్వాత హన్సిక ఆన్‌లైన్‌లో ఎటువంటి కొత్త పోస్ట్‌లు పెట్టకపోవడం అభిమానుల అనుమానాలకు మరింత ఆజ్యం పోసింది. సోహైల్ కూడా 2023 నుండి ఆన్‌లైన్‌లో అంతగా యాక్టివ్ గా ఉండట్లేదు. పైగా తన సోషల్ మీడియా ప్రొఫైల్‌ను ప్రైవేట్ కిందికి మార్చుకున్నారు.
అదే సమయంలో సోహైల్‌తో హన్సిక కలిసి ఉండట్లేదని, ప్రస్తుతం తన తల్లితో కలిసి ఉంటోందని చెబుతున్నారు. ఈ విషయంపై ఇప్పటివరకు హన్సిక మౌనంగా ఉండటం ఈ అనుమానాలను మరింత బలాన్ని ఇచ్చినట్టయింది. హన్సిక ప్రస్తుతం పుట్టింటికి వెళ్లిందని, తల్లి వద్ద ఉంటోందని వారి కుటుంబ సన్నిహితుడొకరు వెల్లడించినట్లు హిందుస్తాన్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది.
అటు సొహైల్ కూడా తన తల్లిదండ్రులతో కలిసి ఉంటోన్నాడని పేర్కొంది. ఇదే విషయం గురించి హన్సికను సంప్రదించగా ఆమె సమాధానం ఇవ్వలేదని, సోహైల్ మాత్రం దీన్ని ఖండించాడని హెచ్ టీ తెలిపింది. ఈ వార్తలు నిజం కాదు అని సింగిల్ లైన్ టెక్స్ట్ మెసేజ్ ద్వారా సమాధానం ఇచ్చాడని, ముభావంగా స్పందించాడని పేర్కొంది.
దీన్ని బట్టి చూస్తోంటే హన్సిక- సొహైల్ ఖటూరియా వివాహ బంధం ఎక్కువ కాలం పాటు కొనసాగకపోవచ్చని, వారకు విడిపోవచ్చనే ఊహాగానాలు మరింత ఊపందుకుంటోన్నాయి. నిజానికి- పెళ్లికి ముందు నుంచే హన్సిక, సోహైల్ స్నేహితులు. సోహైల్‌కు గతంలో రింకీ బజాజ్‌తో వివాహం జరిగింది. హన్సికకు రింకీ అత్యంత సన్నిహితురాలని అప్పట్లో వదంతులు ప్రచారంలో ఉన్నాయి.












Click it and Unblock the Notifications