హనుమాన్ క్లైమాక్స్‌లో ఊహించని ట్విస్ట్..
Hanu Man: టాలీవుడ్ యంగ్ హీరో తేజా సజ్జా హీరోగా నటించిన తాజా చిత్రం హనుమాన్. మైథలాజికల్ మూవీ ఇది. సంక్రాంతి పండగ కానుకగా శుక్రవారం ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సి ఉంది. అంతకంటే ముందే ప్రీమియర్ షోస్ పడిపోయాయి. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందనే టాక్‌ను సొంతం చేసుకుంది.
తేజా సజ్జా హీరోగా నటించిన భారీ బడ్జెట్ మూవీ ఇదే. సోలో హీరోగా జోంబీ రెడ్డి, ఇష్క్, అద్భుతం మూవీల్లో నటించాడు తేజా. అవేవీ ఆశించిన స్థాయిలో గుర్తింపును తెచ్చి పెట్టలేకపోయాయి. దాదాపుగా రెండు సంవత్సరాల గ్యాప్ తరువాత హను మాన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అదరగొట్టాడు. ఈ సినిమాతో స్టార్ హోదాను సొంతం చేసుకున్నట్టే.

అమృత నాయర్, వరలక్ష్మీ శరత్ కుమార్, వినయ్ రాయ్, రాజ్ దీపక్ షెట్టి, వెన్నెల కిశోర్, సత్య, గెటప్ శ్రీను కీలక పాత్రల్లో నటించారు. ప్రశాంత్ వర్మ దర్శకుడు. ప్రైమ్ షో పతాకంపై నిరంజన్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. ప్రీమియర్ షోస్ పడిన అన్ని థియేటర్ల నుంచీ పాజిటివ్ టాక్ వస్తోంది.
ఈ సినిమా క్లైమాక్స్‌లో ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఇప్పటివరకూ పెద్దగా వార్తల్లోకెక్కని సంచలన విషయాన్ని రివీల్ చేశాడు. ఈ సినిమాకు రెండో పార్ట్ కూడా ఉండబోతోందనే సంకేతాలను పంపించాడు. హనుమాన్ సీక్వెల్‌కు టైటిల్‌ను కూడా ప్రకటించాడు.
జై హనుమాన్ పేరుతో ఈ సినిమా రెండో భాగం తెరకెక్కుతుంది. 2025లో దీని సీక్వెల్ విడుదల అవుతుంది. 2025 సంక్రాంతి నాటికి రెండో భాగం ప్రేక్షకుల ముందుకు వస్తుందనే అంచనాలు అప్పుడే వ్యక్తమౌతోన్నాయి. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ కింద రెండో భాగం తెరకెక్కుతుంది.
బాహుబలి పార్ట్ 1 తరహాలో క్లైమాక్స్‌ను ఎండ్ చేశాడు దర్శకుడు. బాహుబలిని కట్టప్ప ఎందుకు పొడిచి చంపాడు అనే ట్విస్ట్ ఎంతగా ఉత్కంఠతను రేకెత్తించిందో.. అదే తరహాలో శ్రీరామచంద్రుడికి హనుమంతుడు ఇచ్చిన వాగ్దానం ఏమిటీ? అనే ట్విస్ట్‌తో ఈ సినిమాకు తెర దించాడు.












Click it and Unblock the Notifications