అమిత్ షాతో హనుమాన్ హీరో: ఏం జరుగుతోంది?

Hanu Man: టాలీవుడ్ యంగ్ హీరో తేజా సజ్జా హీరోగా నటించిన తాజా చిత్రం హనుమాన్. మైథలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ.. సంక్రాంతి రేసులో హీరోగా నిలిచింది. టాప్ హీరోలు నటించిన సినిమాలన్నింటి కంటే భారీ కలెక్షన్లను రాబట్టింది. 250 కోట్ల రూపాయలకు పైగా క్లోజింగ్ బిజినెస్‌ను రికార్డు చేసింది.

తేజా సజ్జా హీరోగా నటించిన భారీ బడ్జెట్ మూవీ ఇదే కావడం.. దానికి తగ్గట్లే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించడం ఓ రికార్డ్. సోలో హీరోగా జాంబీ రెడ్డి, ఇష్క్, అద్భుతం వంటి మూవీల్లో నటించాడు తేజా. అవేవీ ఆశించిన స్థాయిలో గుర్తింపును తెచ్చి పెట్టలేకపోయాయి.

Hanuman actor Teja Sajja met Amit Shah

దాదాపుగా రెండు సంవత్సరాల గ్యాప్ తరువాత హనుమాన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాతో స్టార్ హోదాను సొంతం చేసుకున్నాడు. అమృత నాయర్, వరలక్ష్మీ శరత్ కుమార్, వినయ్ రాయ్, రాజ్ దీపక్ షెట్టి, వెన్నెల కిశోర్, సత్య, గెటప్ శ్రీను కీలక పాత్రల్లో నటించారు. ప్రశాంత్ వర్మ దర్శకుడు. ప్రైమ్ షో పతాకంపై నిరంజన్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు.

ప్రస్తుతం ఈ సినిమా సెకెండ్ పార్ట్‌పై జరుపుకొంటోంది. జై హనుమాన్ పేరుతో తెరకెక్కుతుంది. 2025 సంక్రాంతి నాటికి రెండో భాగం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ కింద రెండో భాగం చిత్రీకరణ జరుపుకొంటోంది.

Hanuman actor Teja Sajja met Amit Shah

కాగా- తేజా సజ్జా, ప్రశాంత్ వర్మ.. హైదరాబాద్‌లో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలుసుకున్నారు. ఆయనతో సమావేశం అయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు వారి మధ్య భేటీ కొనసాగింది. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డితో కలిసి వారు అమిత్ షాతో భేటీ అయ్యారు.

హనుమాన్ సినిమా సాధించిన విజయం గురించి ఆయనకు వివరించారు. సెకెండ్ పార్ట్ థీమ్‌‌నూ తెలియజేశారు. ఈ భేటీ మర్యాదపూరకంగానే జరిగిందని, రాజకీయంగా ఎలాంటి ప్రాధాన్యత లేదని బీజేపీ నాయకులు చెబుతున్నారు. రాజకీయాల ప్రస్తావన వారి మధ్య రాలేదని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+