‘ధురంధర్2’, ‘పుష్ప2’ రికార్డులను చితక్కొట్టేసింది
చూడటానికి సాధారణంగా ప్రారంభమై, బాక్సాఫీస్ వద్ద అసాధారణ విజయాలను సాధించే చిత్రాలు అరుదుగా వస్తుంటాయి. అలాంటి కోవకే చెందుతుంది 'హనుమాన్ అంశ్'. నీమ్ కరోలీ బాబా జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ భక్తిరస చిత్రం ప్రస్తుతం భారత సినీ పరిశ్రమలో ఒక సరికొత్త సంచలనంగా మారింది.
పెద్దగా అంచనాలు లేకుండా, ఎలాంటి స్టార్ క్యాస్టింగ్ లేకుండా కేవలం రూ. 2 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన మొదటి రోజు ఈ చిత్రం కేవలం రూ. 10 లక్షలు మాత్రమే వసూలు చేసింది. తొలి రెండు వారాల్లో రూ. 1.5 కోట్ల కలెక్షన్లతో నెమ్మదిగా సాగిన ఈ ప్రయాణం, 16వ రోజు నుండి ఊహించని విధంగా మలుపు తిరిగింది. ఆంజనేయుడి దయ వల్లో ఏమో గానీ, మౌత్ టాక్ విపరీతంగా పెరగడంతో థియేటర్ల వద్ద ప్రేక్షకుల తాకిడి విపరీతంగా పెరిగింది.

భారీ చిత్రాల రికార్డులు బ్రేక్
సాధారణంగా పెద్ద సినిమాలు మొదటి వారంలోనే అత్యధిక వసూళ్లు సాధించి, ఆ తర్వాత నెమ్మదిస్తాయి. కానీ 'హనుమాన్ అంశ్' సినిమా ఇందుకు పూర్తిగా భిన్నంగా నిలిచింది. ఏకంగా ఆరో వారంలో రూ. 50 కోట్లు వసూలు చేసి అందరినీ విస్మయపరిచింది. అదే సమయంలో విడుదలైన ఇతర బడా చిత్రాల ఆరో వారపు కలెక్షన్లతో పోలిస్తే దీని జోరు ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది:
హనుమాన్ అంశ్: రూ. 50 కోట్లు
పుష్ప2: రూ.9.7 కోట్లు
ధురంధర్ 2: రూ. 7.68 కోట్లు
భూత్ బంగ్లా: రూ. 2.77 కోట్లు
బార్డర్ 2: రూ. 65 లక్షలు
రూ. 300 కోట్ల క్లబ్ లోకి..
ఈ లెక్కలతో 2026లో బాక్సాఫీస్ ను శాసించిన ఎన్నో సూపర్ హిట్ చిత్రాల రికార్డులను ఈ చిన్న సినిమా తిరగరాసింది. ప్రస్తుతం ఈ చిత్రం రూ. 300 కోట్ల మార్కును దాకింది. కేవలం రూ. 2 కోట్ల పెట్టుబడితో ప్రారంభమై, రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం ద్వారా భారత సినీ చరిత్రలో అత్యధిక లాభాలు ఆర్జించిన చిత్రాల జాబితాలో 'హనుమాన్ అంశ్' అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఎన్నో కొత్త సినిమాలు థియేటర్లోకి వచ్చినప్పటికీ, ఈ సినిమా ప్రభావాన్ని ఏదీ తగ్గించలేకపోయింది. కంటెంట్ ఉంటే పెద్ద స్టార్స్ లేకపోయినా ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో అనడానికి ఈ సినిమా ఒక చక్కటి నిదర్శనం.














Click it and Unblock the Notifications
