రూ.2 కోట్ల బడ్జెట్‌తో 36 రోజులకు రూ.200 కోట్లు.. ఇంకా ఆగలేదు!

భారీ తారాగణం, కోట్ల రూపాయల పబ్లిసిటీ ఉంటేనే సినిమాలు ఆడతాయనే అపనమ్మకాన్ని కొన్ని చిన్న సినిమాలు పటాపంచలు చేస్తుంటాయి. ఇప్పుడు ఆ కోవలోనే మరో సంచలనం సృష్టిస్తోంది 'హనుమాన్ అంశ్'. ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా జీవిత స్పూర్తితో తెరకెక్కిన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది.

పెద్ద స్టార్స్ చేయాల్సిన సినిమా ఇది.. స్నేహం, థ్రిల్, ట్విస్టుల కాంబినేషన్!
పెద్ద స్టార్స్ చేయాల్సిన సినిమా ఇది.. స్నేహం, థ్రిల్, ట్విస్టుల కాంబినేషన్!

మౌత్ టాక్ ఆధారంగానే
కేవలం రూ.2 కోట్ల మితమైన బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ఈ సినిమా, మౌత్ టాక్ సాయంతో రోజురోజుకూ తన ప్రభావాన్ని పెంచుకుంటూ పోయింది. ఎలాంటి పెద్ద స్టార్ హీరోల సపోర్ట్ లేకపోయినా, కేవలం బలమైన కంటెంట్, భక్తి భావాలను హత్తుకునే కథనం ప్రేక్షకులను థియేటర్లవైపు పరుగులు పెట్టేలా చేశాయి. ఫలితంగా విడుదలైన కేవలం 36 రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.205.73 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. పెట్టిన పెట్టుబడితో పోలిస్తే వందల రెట్ల లాభాలను ఆర్జించి ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేస్తోంది.

Hanuman Ansh Box Office Record Rs 200 crore in 36 days on a budget of Rs 2 crore and it hasn t stopped yet
ప్రభాస్ 'స్పిరిట్' సినిమాపై నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగ సంచలన వ్యాఖ్యలు.. వారికి సవాల్..!
ప్రభాస్ 'స్పిరిట్' సినిమాపై నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగ సంచలన వ్యాఖ్యలు.. వారికి సవాల్..!

తెలుగులో కూడా వస్తోంది
ఇదిలాఉంటే, ఈ సినిమా జోరు ఇక్కడితో ఆగేలా లేదు. ఇప్పటివరకు వివిధ భాషల్లో సంచలనాలు సృష్టిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు వెర్షన్ సెప్టెంబర్ 18న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఆధ్యాత్మిక కథలను, భక్తి సినిమాలను ఎప్పుడూ ఆదరించే తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రానికి ఎలాంటి నీరాజనం పడుతారో వేచి చూడాలి. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా బాక్సాఫీస్ కలెక్షన్లు తోడైతే, ఈ చిన్న సినిమా సాధించే రికార్డులు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త మైలురాళ్లను తాకడం ఖాయం. సరైన కంటెంట్ ఉంటే చిన్న సినిమా పెద్ద ప్రభావాన్ని చూపగలదని 'హనుమాన్ అంశ్' మరోసారి నిరూపించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+