Hanuman Ansh Movie Review:'హనుమాన్ అంశ్' సినిమా రివ్యూ

Hanuman Ansh Movie Review: హిందీలో అతి తక్కువ బడ్జెట్ అంటే కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన 'హనుమాన్ అంశ్' ప్రపంచవ్యాప్తంగా రూ.430 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద అనూహ్య రికార్డులను సృష్టించింది. ఆధ్యాత్మిక గురువు, సిద్ధపురుషుడు నీమ్ కరోలీ బాబా జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ చిత్రం తాజాగా తెలుగులో విడుదలైంది. ఈ సూపర్ హిట్ మూవీ తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఈ సమీక్ష ద్వారా తెలుసుకుందాం.

నానా పటేకర్‌ చివరి సినిమా రిలీజ్ వాయిదా.. ఎందుకంటే?
నానా పటేకర్‌ చివరి సినిమా రిలీజ్ వాయిదా.. ఎందుకంటే?

స్టోరీ
స్వాతంత్య్రానికి పూర్వపు కాలం నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. డాక్టర్ రామ్ నందన్ భోంస్లే(చందన్ ఆనంద్) సైన్స్‌ను మాత్రమే నమ్మే వ్యక్తి. ఆయనకు దేవుడిపై అసలు నమ్మకం ఉండదు. అయితే ఓ ఊహించని సంఘటన ఆయన ఆలోచనలను మార్చివేస్తుంది. ఈ క్రమంలో ఆయనకు లక్ష్మీనారాయణ శర్మ(శోభినావ్ సత్య) పరిచయం అవుతారు. ఆయనే తరువాతి కాలంలో ప్రసిద్ధ ఆధ్యాత్మిక గురువు 'నీమ్ కరోలీ బాబా'గా ప్రసిద్ధి చెందుతారు. ఆ సాధువు ఎవరు, ఆయన ఆధ్యాత్మిక పరిణామం, ఆయన ప్రభావంతో ప్రజల జీవితాలు ఎలా మారాయనే విషయాలను డాక్టర్ భోంస్లే వివరించే ప్రయాణమే ఈ చిత్ర ముఖ్య కథాంశం.

Hanuman Ansh Movie Review Neem Karoli Baba Biopic Wins Hearts this Rs 2 Cr budget film made Rs 430 Cr

సినిమాలో ప్లస్ పాయింట్స్
ఓ భక్తి లేదా బయోపిక్ చిత్రానికి కావాల్సిన బలమైన భావోద్వేగాలు ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయి. ఫస్టాఫ్ కథకు పునాది వేస్తే.. సెకండాఫ్ ఎమోషన్ పెంచి ప్రేక్షకులు బాబా ప్రయాణంలో మమేకమయ్యేలా చేస్తుంది. ఎలాంటి రాజకీయ ఎజెండాలు లేదా ప్రచారాలు లేకుండా కేవలం బాబా జీవితం, ఆయన కరుణ పైనే కథను నడిపించడం అభినందనీయం. బాబా పాత్రలో శోభినావ్ సత్య తన అద్భుత నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ సినిమాకు మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అతిపెద్ద బలంగా నిలిచాయి. రైలు సీన్, పార్వతి ఇంట్లో భోజనం సీన్, ఇంటర్వెల్ ముందు వచ్చే శివుని ఇమేజరీ సీన్స్ బాగా ఆకట్టుకుంటాయి.

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు 'కామ్రేడ్ కళ్యాణ్' ఫస్ట్ రివ్యూ ఇదే..
Comrade Kalyan First Review: శ్రీవిష్ణు 'కామ్రేడ్ కళ్యాణ్' ఫస్ట్ రివ్యూ ఇదే..

మైనస్ పాయింట్స్
భారీ ట్విస్టులు, యాక్షన్ లేదా సినిమాటిక్ అద్భుతాలను ఆశించి వచ్చే ప్రేక్షకులకు ఇది కొంత నిరాశ కలిగిస్తుంది. ఇది ఓ ప్రశాంతమైన ధ్యానం లాంటి కథనం. కథనం చాలా నెమ్మదిగా సాగడం ఈ సినిమాకు ప్రధాన లోపం. నీమ్ కరోలీ బాబా జీవితం గురించి ఇప్పటికే తెలిసిన వారికి ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. కానీ ఎలాంటి ముందస్తు సమాచారం లేని సగటు ప్రేక్షకులకు కొన్ని సన్నివేశాలు కొంత దూరంగా, రిపీట్ అయినట్లుగా అనిపించవచ్చు.

సాంకేతిక విభాగం
దర్శకుడు విశాల్ చతుర్వేది సహజత్వంతో, ప్రామాణికమైన సంభాషణలతో సినిమాను తెరకెక్కించారు. సంగీత విభాగానికి పూర్తి ప్రశంసలు దక్కుతాయి. సినిమాటోగ్రఫీ కాలానికి తగినట్లుగా ఉంది. అయితే ఎడిటింగ్ ఇంకాస్త కుదించి ఉంటే బాగుండేది. తెలుగు డబ్బింగ్ చాలా సహజంగా, అద్భుతంగా కుదిరింది.

ఫైనల్‌గా..
నీమ్ కరోలీ బాబా భక్తులకు ఇది ఓ గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని ఇస్తుంది. అలాగే సాధారణ సినీ ప్రేక్షకులకు ఇది ఓ మంచి, చూడదగిన ఆధ్యాత్మిక చిత్రంగా నిలుస్తుంది.

*రేటింగ్: 3/5.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+