హనుమాన్ మూవీ.. ఎవరూ టచ్ చేయలేని రికార్డ్!
తేజ సజ్జా, అమ్రిత అయ్యర్ జంటగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హనుమాన్ చిత్రం తెరకెక్కింది. ప్రైమ్ షో ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై కె. నిరంజన్ రెడ్డి నిర్మించారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అభిమానులు కూడా అంచనాలను భారీగా పెట్టుకున్నారు.
ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ యూవీగా ప్రశాంత్ వర్మ రూపొందిస్తున్నారు. ఏకకాలంలో 11 భాషల్లో విడుదల చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలుగు, తమిళం, కన్నడం మళయాళం, హిందీ, మరాఠీ, ఇంగ్లిషు, చైనీస్, జపనీస్, కొరియన్, స్పానిష్ భాషల్లో అందుబాటులోకి రాబోతోంది. అలాగే ఈ సినిమా ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.

ఏ సినిమాకైనా ముందు స్మోకింగ్ ప్రకటన వస్తుంది. మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం అంటూ వార్నింగ్ ఇస్తారు. అయితే హనుమాన్ సినిమాలతో అటువంటి సన్నివేశాలేమీ ఉండవు. సినిమా మొత్తంమీద ఒక్క స్మోకింగ్ షాట్ కూడా లేదు. అందుకే సినిమా ముందు వచ్చే యాడ్ ను తొలగించారు. స్మోకింగ్ యాడ్ లేకుండా ఈరోజుల్లో సినిమా తీశారంటే సాధారణ విషయం కాదంటున్నారు ప్రేక్షకులు. ప్రశాంత్ వర్మను అభిమానులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
ఇది మాములు రికార్డ్ కాదని, ఎవరూ టచ్ చేయలేరని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ సినిమా విడుదలైన తర్వాత ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది. ఈ చిత్రంలో గ్రాఫిక్స్ చాలా బాగున్నాయని, వీఎఫ్ ఎక్స్ వర్క్ ఎంతో నాణ్యంగా ఉందని, గతంలో విడుదలైన భారీ సినిమాలకన్నా ఈ సినిమాల్లో వర్క్ బాగుందనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి.












Click it and Unblock the Notifications