అల్లు అర్జున్ కు గట్టి షాక్ ఇచ్చిన యువ డైరెక్టర్!
ఈ ఏడాది సంక్రాంతికి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో థియేటర్ల కోసం ఎంత యుద్ధం జరిగిందో మనందరం చూసిందే. రవితేజ లాంటి హీరోను సినీ పెద్దలు ఒప్పించడంతో తన ఈగల్ సినిమాను వాయిదా వేసుకున్నారు. అయితే అప్పటికే పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదలకు సిద్ధమైన హనుమాన్ చిత్రాన్ని కూడా విడుదల తేదీ నుంచి మారాలని కోరినప్పటికీ, వాయిదా వేయాలని ఒత్తిడి చేసినప్పటికీ తమ సినిమామీద నమ్మకంతోపాటు అప్పటికే అన్ని భాషల్లో (తెలుగు మినహా) థియేటర్లు కూడా సిద్ధమవడంతో నిర్మాతలు వెనక్కి తగ్గలేదు
గుంటూరు కారం సినిమాతోపాటు అదేరోజు విడుదలైన హనుమాన్ సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. అయోధ్య రామమందిరానికి చిత్ర యూనిట్ విరాళం కూడా ప్రకటించింది. ప్రశాంత్ వర్మ దర్శకుడు కాగా.. తేజ సజ్జా హీరోగా నటించారు. అన్ని రికార్డులను బద్దలు కొట్టుకుంటూ తాపీగా ముందుకు దూసుకుపోతున్న ఈ చిత్రం మరిన్ని థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది.

దాదాపు రూ.300 కోట్ల కలెక్షన్లకు దగ్గరలో ఉంది. తెలుగులో సంక్రాంతికి విడుదలైన ఏ సినిమా కూడా ఇన్ని కోట్ల రూపాయలు వసూలు చేయలేదు. 92 సంవత్సరాల తెలుగు సినీ పరిశ్రమ చరిత్రలో సంక్రాంతికి ఎన్నో బ్లాక్ బస్టర్లు ఉన్నాయి. కానీ అవేవీ వసూలు చేయలేని కలెక్షన్లను హనుమాన్ కొల్లగొట్టింది. మొన్నటివరకు ఈ రికార్డు అల్లు అర్జున్ పేరుమీద ఉండేది. 2020లో సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.260 కోట్లు వసూలు చేసి సంచలన విజయాన్ని సాధించింది. ఇప్పటివరకు అదే నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. తాజాగా రూ.278 కోట్లు వసూలు చేసినట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఓవర్సీస్ లో విజయవంతంగా దూసుకుపోతున్న ఈ చిత్రం భవిష్యత్తులో మరెన్ని రికార్డులు నెలకొల్పనుందో చూడాలి.












Click it and Unblock the Notifications