చిన్న సినిమాకు రూ. 400 కోట్ల కలెక్షన్స్.. చరిత్ర చూడని విధ్వంసం..!

కంటెంట్ కరెక్ట్ గా ఉంటే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో విధ్వంసం క్రియేట్ చేస్తుందో నిరూపించిన చిత్రం 'హనుమాన్‌ అంశ్‌'.. ఇలాంటి చిన్న సినిమాలు అఖండ విజయం సాధించినప్పుడు.. కొన్ని సినిమాలకు పెద్ద పెద్ద హీరోలు.. భారీ యాక్షన్ సీక్వెన్స్ లు.. వందల కోట్ల బడ్జెట్ లు ఎందుకు పెడతారో..? అని సందేహం వస్తుంటుంది చాలా మందికి.. కేవలం రూ. 2 కోట్లతో తెరకెక్కిన హనుమాన్‌ అంశ్‌ మూవీ బాక్సాఫీస్ వద్ద ఇప్పటి వరకూ ఏకంగా రూ. 400 కోట్ల వరకు రాబట్టింది. ఇటీవల భారీ హైప్ తో రిలీజ్ అయిన 'టాక్సిక్' మూవీ ఆల్ టైమ్ రికార్డ్స్ ను ఈ మూవీ చెరిపేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ మేరకు ఈ రెండు సినిమాలను పోల్చుతూ సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

రాకింగ్ స్టార్ యశ్ 'టాక్సిక్' మూవీ దాదాపు రూ. 450 కోట్ల భారీ బడ్జెట్‌ తో రూపొందింది. కేవీఎన్ నిర్మాణ సంస్థ ఈ మూవీని నిర్మించింది. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ డిజాస్టర్ టాక్ తో కేవలం రూ.342 కోట్ల గ్రాస్ మాత్రమే సాధించింది. ఇక ఈ చిత్రాన్ని రూ. 400 కోట్లకు థియేట్రికల్ రైట్స్ అమ్మగా ఫుల్ రన్ లో కేవలం రూ. 160 కోట్ల షేర్ మాత్రమే రాబట్టి భారీ నష్టాలను చవిచూసింది. అయితే కేవలం రూ. 2 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన హనుమాన్ అంశ్ మూవీ మాత్రం రూ. 200 కోట్ల షేర్ రాబట్టింది అంటూ నెటిజన్లు నెట్టింట కామెంట్స్ పెడుతున్నారు.

ఇక హనుమాన్ అంశ్ మూవీ దండయాత్ర బాక్సాఫీస్ వద్ద కొనసాగుతూనే ఉంది. 47వ రోజు కూడా హనుమాన్ అంశ్ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 4.90 కోట్లు కలెక్ట్ చేసి అందరినీ ఆశ్చర్య పరిచింది. ఈ రోజుల్లో సినిమా ఎంత బాగున్నా రెండు వారాల్లోనే సర్దేస్తున్నారు. ఆ తర్వాత మరో వారానికి ఆ మూవీ ఓటీటీలో ప్రత్యక్షం అవుతున్న సంగతి తెలిసిందే. కానీ హనుమాన్ అంశ్ మూవీ కేవలం మౌత్ టాక్ తోనే 47 రోజులుగా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితం అవుతోంది.

HanumanAnsh movie heads towards 400 crore mark by collecting approximately 5 crore on its 47th day

ఈ చిత్రానికి విశాల్ చతుర్వేది రచన, దర్శకత్వంతో పాటు స్వయంభు మీడియా నెట్‌ వర్క్ బ్యానర్‌ పై నిర్మాతగానూ వ్యవహరించారు. నీమ్ కరోలీ బాబా ఆధ్యాత్మిక ప్రయాణం గురించి విశాల్ చతుర్వేది రాసిన 'దివ్య యాత్ర: ది వన్ హూ చేంజ్డ్ మై లైఫ్' పుస్తకాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రస్తుతం థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న ఈ సినిమా త్వరలోనే ఓటీటీలోనూ సందడి చేయనుంది. ఇక హనుమాన్ అంశ్ మూవీని మొత్తం 3 భాగాలుగా తీస్తున్నారు దర్శకుడు విశాల్ చతుర్వేది. రెండో భాగం షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ అయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+