'హనుమాన్ అంశ్' చిత్రాన్ని మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరో అతనేనా..? చేసుంటే బాక్సాఫీస్ రికార్డులు బద్దలే..!

కంటెంట్ ఈజ్ కింగ్ అని మరోసారి నిరూపించిన చిత్రం 'హనుమాన్ అంశ్'.. కేవలం రూ. 2 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 400 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టి ట్రూ పాన్ ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సాధారణంగా సినిమా రీలజ్ సమయంలో ప్రొమోషన్స్.. ఇంటర్వ్యూలు.. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లాంటివి చేస్తుంటారు. కానీ ఎలాంటి ప్రమోషన్స్, స్టార్ నటీనటులు లేకుండా ఆగస్టు 07న హనుమాన్ అంశ్ మూవీ హిందీలో రిలీజైంది.

అయితే ఆడియెన్స్ మౌత్ టాక్ అద్భుతంగా రావడంతో సినిమాకు ఆదరణ క్రమంగా పెరిగిపోయింది. ఒక్కో వారానికి వసూళ్లు పెరుగుతూ వచ్చాయి. అలా ఈ సినిమా 50 రోజుల థియేట్రికల్ రన్ ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ రోజుల్లో 50 డేస్ థియేట్రికల్ రన్నింగ్ కంప్లీట్ చేసుకోవడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి. హిందీలో సంచలన విజయం అందుకున్న హనుమాన్ అంశ్ మూవీ తాజాగా తెలుగులో విడుదలైన సంగతి తెలిసిందే.

'హనుమాన్ అంశ్' ఆక్టోబర్ 09న తెలుగు వెర్షన్ రిలీజైంది. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేసింది. శుక్రవారం దాదాపు 703 షోలతో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాగా తొలిరోజు రూ. 60 లక్షలు సాధించింది. ఇక రానున్న దసరా సీజన్ లో కలెక్షన్స్ పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ మూవీ ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త మహారాజ్ నీమ్ కరోలి బాబా జీవితం, బోధనల నుంచి ప్రేరణ పొందిన దర్శకుడు విశాల్ చతుర్వేది ఒక ఆధ్యాత్మిక డ్రామాగా తెరకెక్కించారు.

ఈ మూవీలో షోభినవ్ సత్య ప్రధాన పాత్రలో నటించగా, చందన్ ఆనంద్, అనిల్ రస్తోగి, పూర్ణిమ తివారి, భగవాన్ దాస్ పటేల్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇక స్వంభు మీడియా నెట్‌వర్క్‌, హోలీ కౌ హోమ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై సినిమా తెరకెక్కింది. రాగిణి సోనా, విశాల్ చతుర్వేది, అనుప్రియా నగర్, నమ్రతా జి సింగ్ నిర్మాతలుగా వ్యవహరించారు.

HanumanAnsh movie latest news Is he the Tollywood hero who missed out on the movie Hanuman Ansh

అయితే హనుమాన్ అంశ్ ను టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సురేష్ బాబు తెలుగు లో తన సోదరుడు విక్టరీ వెంకటేష్ తో రీమేక్ చెయ్యాలని అనుకున్నారట. కానీ కథలో కమర్షియల్ హంగులు లేని కారణంగా వెంకటేష్ ఈ మూవీని రిజెక్ట్ చేసినట్టు సమాచారం. ఇలాంటి సినిమాల్లో మన ఆడియన్స్ కోసం కమర్షియల్ ఎలిమెంట్స్ ను యాడ్ చేస్తే.. సినిమాలోని సోల్ మిస్ అవుతుంది. అందుకే వద్దని చెప్పారట. అయితే ఈ మూవీని వెంకీ చేసుంటే బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించేవారని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+