బయటపడ్డ హార్దిక్ పాండ్యా రిలేషన్..ఆ హీరోయిన్‌తో డేటింగ్..?

టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ హార్దిక్ పాండ్యా వివాహిక జీవితం విషాదంతంగా ముగిసిన సంగతి తెలిసిందే. హార్దిక్ పాండ్యా తన భార్య నటాషాకు విడాకులు ఇచ్చినట్టు ప్రకటించారు. విడాకుల విషయాన్ని హార్దిక్ పాండ్యా తన సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఈ కష్ట సమయంలో తనకు అందరు అండగా నిలవాలని ఆయన కోరారు. హార్దిక్ విడాకులు తీసుకోబోతున్నారంటూ గత కొద్దిరోజులుగా అనేక కథనాలు వెలువడ్డాయి.

ఐపీఎల్ ప్రతి సీజన్‌లో నటాషా కనిపించి తన భర్త హర్దిక్‌కు సపోర్ట్ చేసేది. అయితే ఈ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్‌గా పాండ్యా అరంగేట్రం చేసినా.. నటాషా మాత్రం ఎక్కడా కనిపించలేదు. అలాగే, అతను ఏ మ్యాచ్ చూసేందుకు రాలేదు. అలాగే మార్చి 4 నటాషా పుట్టినరోజు. ఆ రోజు, హార్దిక్ పాండ్యా తన భార్యకు సోషల్ మీడియాలో ఒక్క పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా పోస్ట్ చేయలేదు.

Hardik Pandya in a relationship with star heroine Ananya Pandey

దీనికి తోడు నటాషా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుండి పాండ్యా అనే ఇంటిపేరును తొలగించింది. దీంతో నటాషా హార్దిక్ పాండ్యాకు విడాకులు ఇవ్వడం ఖాయమనే అప్పుడే అంతా భావించారు. అందరు అనుకున్నట్టే హార్దిక్, నటాషా విడాకులు తీసుకున్నారు. ఇదిలా ఉంటే నటాషాతో విడాకులు తర్వాత హార్దిక్ బాలీవుడ్ హీరోయిన్‌తో రిలేషన్‌లో ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనన్య పాండే, హార్దిక్ ఇద్దరు డేటింగ్‌లో ఉన్నారంటూ బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.

వీరిద్దరు కలిసి అంబానీ పెళ్లిలో సందడి చేశారు. హిందీ పాటలకు ఇద్దరు కలిసి చిందులు వేసిన వీడియోలు సోషల్ మీడియిలో తెగ వైరల్ అయ్యాయి. దీనికి తోడు సోషల్ మీడియాలో వీరిద్దరు ఒకర్ని ఒకరు ఫాలో అవుతున్నారు. దీంతో అనన్య పాండే, హార్దిక్‌లు రిలేషన్‌లో ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. అనన్య పాండే గతంలో ఇషాన్ ఖత్తర్, కార్తిక్ ఆర్యన్, ఆదిత్యరాయ్ కపూర్‌తో డేటింగ్ చేసింది. రీసెంట్‌గానే ఆదిత్యరాయ్ కపూర్‌కు బ్రేకప్ చెప్పింది ఈ బ్యూటీ. ప్రస్తుతం అనన్య పాండే, హార్దిక్‌ పాండ్యాల రిలేషన్‌ హాట్ టాపిక్‌గా మారింది. మరి దీనిపై ఈ జంట ఎలా స్పందిస్తారో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+