ఆడియన్స్ పై రివెంజ్.. రెండో రోజే ఫ్లెక్సీ ని తీసేశారు?.. వీడియో వైరల్..!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీ జులై 24 ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. అయితే మార్నింగ్ షో నుంచే ఈ మూవీకి నెగెటివ్ టాక్ వచ్చింది. సినిమాలో రక్తికట్టించే సీన్ ఒక్కటంటే ఒక్కటి కూడా లేదంటూ.. సెకండ్ హాఫ్ మరీ అధ్వానంగా తీశారని వీఎఫ్ఎక్స్ దారుణంగా ఉందని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఎలా పడితే అలా తీసి మా ముఖంపై కొడతారా అంటూ ఫైర్ అవుతున్నారు. అయితే ఈ మూవీకి ప్రీమియర్ షోల ద్వారా రూ. 30 కోట్లు వచ్చినట్లు సమాచారం. ఈ విషయాన్ని నిన్న జరిగిన సక్సెస్ మీట్ లో స్వయంగా పవన్ కల్యాణ్ వెల్లడించారు. ఇక జులై 24 న దాదాపు రూ. 40 కోట్ల వరకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇవి రిలీజ్ కు ముందే బుకింగ్ అయిన టికెట్స్ కాబట్టి ఇంత కలెక్షన్ వచ్చిందని రెండోరోజు నుంచి కలెక్షన్స్ లో ఊహించని డ్రాప్ ఉంటుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
హరిహర వీరమల్లు సినిమాకు ఇంతటి ఘోరమైన నెగటివ్ టాక్ వచ్చిన తర్వాత రెండవ రోజు కలెక్షన్స్ ఎలా ఉంటాయో మీరే ఊహించుకోవచ్చు. ఇక సోషల్ మీడియా లో రెండవ రోజు హరి హర వీరమల్లు బ్యానర్స్ ని ఎత్తివేస్తున్న వీడియో హల్చల్ చేస్తుంది. ఈ వీడియో ని కొందరు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. ఇక యూకేలోని ఓ సింగిల్ స్క్రీన్ లో మూవీని ప్రదర్శిస్తుండగా కొందరు ఫ్యాన్స్ థియేటర్ లో రచ్చ రచ్చ చేశారు. ఫర్నీచర్ ధ్వంసం కావడంతో సినిమాను నిలిపివేశారు అక్కడి అధికారులు. అలా చేసినవారిని థియేటర్ నుంచి బయటకు పంపించారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

ఇక ఈ మూవీలో వీఎఫ్ఎక్స్ సీన్లు కొన్ని పేలవంగా ఉన్నాయని చెబుతున్నారు. దీంతో ఆ సీన్లను కట్ చేసే పనిలో వీరమల్లు టీమ్ ఉన్నట్లు సమాచారం. దీంతో సినిమాను కొంచెం ట్రిమ్ చేయనున్నట్లు సమాచారం. మరి ఫుల్ రన్ లో వీరమల్లు ఎంత వరకు కలెక్షన్లు రాబడుతుంది అనేది తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications