పవన్ కళ్యాణ్‌కు పోటీగా సమంత సినిమా.. పెద్ద సాహసమే?
స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ లోని దాదాపు టాప్ హీరోస్ అందరితో ఆమె నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే కొన్నేళ్ల క్రితం ఆమె ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పేరుతో సొంత ప్రొడక్షన్ హౌజ్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే బ్యానర్ లో ఆమె నిర్మిస్తున్న తొలి సినిమా 'శుభం' హారర్ కామెడీ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కింది. అయితే తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ మూవీని మే 9న రిలీజ్ చేయనున్నట్లు సమంత ప్రకటించింది. సామ్ ప్రొడ్యూస్ చేసిన మూవీ కావడంతో ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
గత నెల 30న శుభం మూవీ టీజర్ రిలీజై మంచి రెస్పాన్స్ అందుకుంది. శుభం సినిమాకు సినిమాబండి ఫేమ్ డైరెక్టర్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో హర్షిత్ రెడ్డి, శ్రీయా కొంతం, గవిరెడ్డి శ్రీనివాస్ లీడ్ రోల్స్ చేశారు. ఈ మూవీ మే 9న రిలీజ్ కానుంది. సినిమాబండి మూవీతో ప్రశంసలు దక్కించుకున్న దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల తీస్తున్న సినిమా కావడంతో శుభం చిత్రంపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. సమంత నిర్మాతగా చేస్తున్న తొలి సినిమా కావడం మరో విశేషం. ఇక ఈ చిత్రానికి వసంత్ మారిగంటి కథ అందించారు.
అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. మే 9వ తేదీన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు చిత్రం రిలీజ్ కానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే మేకర్స్ పోస్టర్ ద్వారా ప్రకటించారు. ఈ మూవీకి జ్యోతి కృష్ణ డైరెక్షన్ చేస్తున్నారు. ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. పవన్ నటిస్తున్న హిస్టారికల్ యాక్షన్ మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ చిత్రాన్ని ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. వచ్చే నెల 9న విడుదల చేయనున్నట్లు ఈ మధ్య ప్రకటించారు. కానీ ఇప్పుడు అదే డేట్ కి సమంత నిర్మించిన శుభం సినిమాను రిలీజ్ చేస్తుండటం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే 'హరి హర వీరమల్లు' సినిమా మరోసారి వాయిదా పడే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ 11 సార్లు వాయిదా పడినట్లు సోషల్ మీడియా కోడైకూస్తోంది.












Click it and Unblock the Notifications