హరిహర వీరమల్లు ఫస్ట్ డే కలెక్షన్స్.. బాయ్‌కాట్ దెబ్బ గట్టిగానే పడిందిగా..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన "హరిహర వీరమల్లు" చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా నెగిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. సినిమా కథ, దర్శకత్వంపై విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా, సినిమాలోని కోర్ ఎమోషన్ సరిగా ప్రజెంట్ చేయలేదని, సెకండ్ హాఫ్ చాలా నెమ్మదిగా సాగుతోందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా కొంతవరకు నిరాశ చెందుతున్నారు.
క్రిష్ జాగర్లమూడి మొదట ఈ సినిమాను తెరకెక్కించినా, తర్వాత జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలు చేపట్టడం సినిమా అవుట్ పుట్‌పై ప్రభావం చూపింది. జ్యోతి కృష్ణకు పెద్దగా అనుభవం లేకపోవడం, స్టార్ హీరోను హ్యాండిల్ చేయలేకపోవడం వంటి విమర్శలు వస్తున్నాయి.హరిహర వీరమల్లు చిత్రానికి కేవలం నెగిటివ్ టాక్ మాత్రమే కాదు, రాజకీయ ప్రభావం కూడా గట్టిగానే తగిలింది. పవన్ కళ్యాణ్ నటించిన ఈ సినిమాపై అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో బాయ్‌కాట్ ట్రెండింగ్ చేయడం సినిమా వసూళ్లపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది.

'వీరమల్లు' సినిమా మొదటి రోజు వసూళ్ల విషయంలో పవన్ కళ్యాణ్ అభిమానులకు నిరాశనే మిగిల్చింది. 'పుష్ప 2' మొదటి రోజు కలెక్షన్లు (294 కోట్లు) అధిగమించడం సంగతి అటుంచి, 'వీరమల్లు' ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్ షోలతో కలిపి కేవలం 70 కోట్ల గ్రాస్ కలెక్షన్లు మాత్రమే రాబట్టింది. నెట్ కలెక్షన్లు అయితే 32.5 కోట్లు అని ప్రముఖ వెబ్‌సైట్ సాక్నిల్క్ పేర్కొంది.
సినిమా టికెట్ల ధరలు భారీగా పెంచి, 700కి పైగా ప్రీమియర్ షోలు వేసినప్పటికీ ఈ స్థాయి వసూళ్లే వచ్చాయి. బెనిఫిట్ షోల ద్వారా 12.7 కోట్ల నెట్ రాగా, మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 32.5 కోట్ల నెట్ కలెక్షన్లు మాత్రమే వచ్చాయని సాక్నిల్క్ తెలిపింది. హైదరాబాద్, విజయవాడలలో మాత్రమే అత్యధికంగా టికెట్లు అమ్ముడయ్యాయి.
'పుష్ప 2' హిందీ వెర్షన్ మొదటి రోజునే 72 కోట్ల గ్రాస్ వసూలు చేయగా, ఆ రికార్డును 'వీరమల్లు' తన మొత్తం కలెక్షన్లతో కూడా అందుకోలేకపోయింది. దీనిని బట్టి చూస్తే, 'వీరమల్లు' ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయిందని స్పష్టమవుతోంది.












Click it and Unblock the Notifications