'హరి హర వీరమల్లు' ఫస్ట్ రివ్యూ వచ్చేసిందోచ్ ..!

మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'హరి హర వీరమల్లు' మరో 24 గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా గురువారం విడుదల అవుతున్నప్పటికీ, ప్రీమియర్స్ షోస్ మాత్రం బుధవారం రాత్రి నుంచే మొదలుకానున్నాయి. జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించగా, ఏఎం రత్నం ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ రివ్యూ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది.

కథ నేపథ్యం
17వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ చారిత్రక యోధుడు వీరమల్లు పాత్రలో జీవించారని చిత్ర యూనిట్ ఘంటాపథంగా చెబుతోంది. నిరంకుశత్వానికి వ్యతిరేకంగా, సత్యం, విశ్వాసం, స్వేచ్ఛ కోసం జరిగే న్యాయ పోరాటం, సనాతన ధర్మం కోసం వీరుడి పవర్ ఫుల్ జర్నీని తెరపై చూడబోతున్నామని తెలుస్తోంది.

harihara veeramallu first review

ముఖ్యంగా కోహినూర్ డైమండ్ బ్యాక్ డ్రాప్‌గా సాగే కథనం ప్రేక్షకులను ఆద్యంతం కట్టిపడేస్తుందట. పవన్ కళ్యాణ్ అభిమానులకు 'హరి హర వీరమల్లు' చిత్రం ఒక విజువల్ ఫీస్ట్ కానుందని తెలుస్తోంది. కేవలం ఆకర్షణీయమైన కథనం, కళ్లు చెదిరే సన్నివేశాలే కాకుండా, ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలవనున్నవి ఇంటర్వెల్‌కు ముందు, ఆ తర్వాత వచ్చే రెండు యాక్షన్ ఎపిసోడ్స్ అని సమాచారం. ఈ యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ అందించేలా అద్భుతంగా చిత్రీకరించారని తెలుస్తోంది.

సెన్సార్ బోర్డు ప్రశంసలు, విజువల్ ఫీస్ట్
సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికెట్ (CBFC) అధికారులు ఈ చిత్రాన్ని వీక్షించి పూర్తిస్థాయిలో సంతృప్తి వ్యక్తం చేశారు. ఎలాంటి అభ్యంతరకర కంటెంట్ లేకుండా రూపొందించిన ఈ సినిమా సెన్సార్ బోర్డు సభ్యులను ఎంతగానో ఆకట్టుకుందట. చిన్న చిన్న మార్పులు, కొన్ని డైలాగుల్లో బీప్స్‌తో పెద్దగా అభ్యంతరాలు తెలపకుండా U/A సర్టిఫికెట్ జారీ చేశారు. ముఖ్యంగా, సినిమాకి ప్రధాన బలంగా నిలిచిన ఆకర్షణీయమైన కథనం, కళ్లు చెదిరే సన్నివేశాలతో ఈ సినిమా ఒక 'విజువల్ ఫీస్ట్'గా ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ప్రశంసలతో ముంచెత్తారు.

సాంకేతిక విలువలు, హైలైట్స్:
బాబీ డియోల్, నిధి అగర్వాల్ తో పాటు ఎందరో ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ కళా దర్శకుడు తోట తరణి అద్భుతమైన సెట్‌లను తీర్చిదిద్దగా, ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. 2 గంటల 42 నిమిషాల రన్ టైమ్‌తో రూపొందిన ఈ చిత్రం, పవన్ కళ్యాణ్ తనదైన నటన, యాక్షన్ ఎపిసోడ్స్‌తో హైలెట్‌గా నిలుస్తుందని యూనిట్ బలంగా నమ్ముతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+