పవన్ కల్యాణ్ వల్లే త్రివిక్రమ్‌పై హరీష్ శంకర్ సెటైర్..?
దర్శకుడు హరీష్ శంకర్ గురించి మీడియాలో విపరీతమైన చర్చ సాగుతోంది. హరీష్ శంకర్ తీసింది తక్కువ సినిమాలే అయినప్పటికి, అనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తన మొదటి సినిమా ''షాక్''తో ఫ్లాప్‌ను మూటగట్టుకున్న హరీష్ శంకర్‌కు హీరో రవితేజ పిలిచి మరి రెండో అవకాశం ఇచ్చారు. ''మిరపకాయ్'' సినిమాతో హిట్ కొట్టిన హరీష్ శంకర్,ఆ తర్వాత పవన్ కల్యాణ్‌తో ''గబ్బర్ సింగ్'' వంటి బ్లాక్ బ్లాస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే వెంటనే ''రామయ్య వస్తావయ్యా'' వంటి డిజాస్టర్‌ను ఎన్టీఆర్‌కు అందించాడు. దీంతో హరీష్ శంకర్ క్రేజ్ అమాంతం పడిపోయింది. ఆ తర్వాత వరుణ్ తేజ్‌తో గద్దలకొండ గణేష్‌ను తెరకెక్కించాడు. ఈ సినిమా ఓ మోస్తరుగా ఆడటంతో.. హరీష్ శంకర్ రీమేక్ సినిమాలను మాత్రమే చేయగలడని ముద్ర వేయించుకున్నాడు. ఇక ప్రస్తుతం రవితేజతో ''మిస్టర్ బచ్చన్'' సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహించాడు. ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా అంచనాలు అందుకోవడం ఫెయిల్ అయిందని తెలుస్తోంది.
దీంతో నెటిజన్లు ఈ సినిమాను ఘెరంగా ట్రోల్ చేస్తున్నారు. సినిమా చూసిన వారు నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు. దీంతో మూవీపై తీవ్రమైన ట్రోలింగ్స్ జరుగుతున్నాయి. రవితేజ లైఫ్ ఇస్తే , ఆయన లైఫ్‌తోనే హరీష్ శంకర్ ఆడుకున్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. రీమేక్ సినిమాను ఇలా కూడా తీస్తారా అంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. హీరోయిన్‌ను కేవలం గ్లామర్‌కే పరిమితం చేశారని, కథను బాగా సాగదీశాడని హరీష్ శంకర్‌ను ట్రోల్ చేస్తున్నారు. మీడియా అటెన్షన్‌పై ఉన్న శ్రద్ద సినిమాపై పెడితే బాగుండేదని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ''మిస్టర్ బచ్చన్'' నెగిటివ్ టాక్ రావడంతో రవితేజ అభిమానులు హరీష్ శంకర్‌పై గుర్రుగా ఉన్నారు.

ఇదే సమయంలో సినిమాలో డైలాగులు గురించి కూడా ప్రస్తావనకు వస్తోంది. ''మిస్టర్ బచ్చన్'' సినిమాలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌పై హరీష్ శంకర్ సెటైర్ వేశాడనే మాటలు వినిపిస్తున్నాయి. సినిమాలో హీరో కావాలనుకునే కమెడియన్ చమ్మక్ చంద్ర.. అతడిని మంచి హీరోని చేస్తా అంటూ పక్కనే కూడా ఉండే గురూజీ అని పిలిపించుకునే మరో కమెడియన్ ప్రభాస్ శ్రీను.. పాత్రలు ఉంటాయి.ఈ గురూజీ.. గురూజీ.. అనే పిలుపు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను టార్గెట్ చేసి కావాలని పెట్టారా ? అన్న చర్చలు ఇండస్ట్రీ వర్గాల్లో నడుస్తున్నాయి. అయితే ఆ మధ్య హరీష్ శంకర్ , పవన్ కల్యాణ్మధ్య మాటలు లేవని తెలుస్తోంది. ''గబ్బర్ సింగ్'' తర్వాత ''అత్తారింటికి దారేది'' సినిమాలో నటించారు.
అయితే ఆ సినిమా తర్వాత పవన్ కల్యాణ్, హరీష్‌తో సినిమా చేయాల్సి ఉంది. కారణాలు తెలియవు కానీ, సడన్‌గా హరీష్ శంకర్ స్థానంలో డైరెక్టర్ బాబీ చేరారు. ఆ సినిమానే సర్దార్ గబ్బర్ సింగ్. ఈ సినిమా సమయంలో హరీష్ శంకర్‌ను ప్రశ్నించగా, కల్యాణ్‌గారు కొత్తవారిని ఎంకరేజ్ చేస్తున్నారని, అందుకే బాబీతో సినిమా చేస్తున్నారని చెప్పి తప్పించుకున్నారు. కానీ ఆ సినిమా తన నుంచి బాబీ చేతికి వెళ్లడం వెనుక త్రివిక్రమ్ హస్తం ఉందని, అందుకే ఆయన మీద పగను హరీష్ శంకర్ ఈ విధంగా తీర్చుకున్నారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. హరీష్ శంకర్ ''మిస్టర్ బచ్చన్'' కంటే ముందు పవన్ కల్యాణ్‌తో ''ఉస్తాద్ భగత్ సింగ్'' సినిమాను మొదలుపెట్టారు. అయితే ఎన్నికల కారణంగా ఈ సినిమా ఆగిపోవడంతో రవితేజతో ''మిస్టర్ బచ్చన్''ను లైన్లో పెట్టాడు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకోవడంతో హరీష్ శంకర్‌తో సినిమా చేయవద్దని పవన్‌ను అభిమానులు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications