Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వామ్మో.. ఈ సినిమా ముందు 'ఆరుగురు పతివ్రతలు' ఎందుకు పనికి రాదు

థియేటర్లలో కొత్త సినిమాలు సందడి చేస్తున్న వేళ, ఇప్పటికే రిలీజైన సినిమాలు ఓటీటీల్లో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. తెలుగు, తమిళం, హిందీతో పాటు హాలీవుడ్ సినిమాలు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో రకరకాల జోనర్లలో అందుబాటులో ఉన్నా యి. అయితే, ఈసారి ఓటీటీలో వచ్చిన ఒక రొమాంటిక్ సినిమా మాత్రం బోల్డ్ కంటెంట్‌తో సంచలనం సృష్టిస్తోంది.

సాధారణంగా హారర్, థ్రిల్లర్ సినిమాలకు ఓటీటీల్లో మంచి క్రేజ్ ఉంటుంది. కానీ, తాజాగా ఓటీటీలో విడుదలైన ఒక సినిమా మాత్రం 'బోల్డ్' కంటెంట్‌తో రచ్చ రచ్చ చేస్తోంది. ఆ సినిమా పేరే ' హసీన్ దిల్‌రుబా '.

Haseen Dilruba Review Bold Romance Murder Mystery amp amp a Better Twist Than Drishyam

క్లైమాక్స్ ఊహకు అందకుండా, ప్రతి ఫ్రేమ్‌లోనూ ట్విస్ట్ దాగిన సస్పెన్స్ థ్రిల్లర్లను ఇష్టపడేవారికి 'హసీన్ దిల్‌రుబా'ఒక విభిన్నమైన ట్రీట్. 2021లో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై సంచలనం సృష్టించిన ఈ హిందీ చిత్రం, కేవలం క్రైమ్ థ్రిల్లర్ మాత్రమే కాదు, ఓ వివాహ బంధంలో దాగి ఉన్న సంక్లిష్టమైన ప్రేమ, మోసం, పగ వంటి ఎమోషన్స్ మిక్స్ అయిన పవర్ ప్యాక్డ్ డ్రామా.నిజం చెప్పాలంటే, సస్పెన్స్ విషయంలో బాలీవుడ్‌లో మైలురాయిగా నిలిచిన 'దృశ్యం' కంటే కూడా మరింత ఊహించని, గ్రిప్పింగ్ క్లైమాక్స్ ఈ సినిమా సొంతం.

కథ అంతా రాణి (తాప్సీ పన్ను) ,రిషు (విక్రాంత్ మాస్సే) అనే ఇద్దరి చుట్టూ తిరుగుతుంది. వీరికి పెద్దలు కుదిర్చిన పెళ్లి అవుతుంది. రాణి, బయట ప్రపంచాన్ని, సినిమాల్లోని ప్రేమ కథలను ఇష్టపడే ఉల్లాసమైన యువతి కాగా, రిషు ప్రశాంతమైన, సంప్రదాయబద్ధమైన ఇంజనీర్. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ పండకపోవడం, అనుబంధం దూరమవుతున్న సమయంలో, రాణి జీవితంలోకి నీల్ (హర్షవర్ధన్ రాణే) ఎంట్రీ ఇస్తాడు.

నీల్ రావడంతో రాణి-రిషు జీవితాల్లో ఊహించని మలుపులు మొదలవుతాయి. ఈ క్లిష్టమైన త్రికోణ ప్రేమ కథ నడుస్తున్న సమయంలోనే, ఒక మర్డర్ కేసు తెరపైకి వస్తుంది. రిలేషన్‌షిప్‌లో ఉన్న సమస్య కాస్తా మర్డర్‌కు ఎలా దారితీసింది? అసలు హత్యకు గురైన వ్యక్తి ఎవరు?, ఆ అసలు కిల్లర్ ఎవరు? అనే ప్రశ్నలతో రచయిత్రి కనికా ధిల్లాన్ కథను అత్యంత ఉత్కంఠభరితంగా నడిపించారు.

దర్శకుడు వినీల్ మాథ్యూ, ఈ సస్పెన్స్ , ఎమోషన్స్‌ను పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేయడంలో విజయం సాధించారు. కథలో వచ్చే ప్రతి ట్విస్ట్ దినేష్ పండిట్ క్రైమ్ నవలల్లోని ఫ్లేవర్‌ను గుర్తుచేస్తుంది.మొత్తంగా, 2 గంటల 15 నిమిషాల రన్‌టైమ్‌లో ఒక్క క్షణం కూడా ప్రేక్షకుడిని పక్కకు కదలకుండా చేసే 'హసీన్ దిల్‌రుబా', సస్పెన్స్ థ్రిల్లర్ ప్రియులకు ఖచ్చితంగా చూడదగిన చిత్రం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+