ప్రభాస్ మరదల్ని ఎప్పుడైనా చూశారా..? హీరోయిన్లు కూడా సరిపోరు
'సలార్' సినిమాతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరోసారి తన సత్తాను చాటారు. కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన 'సలార్' బాక్సాఫీస్ వద్ద రికార్డులను కొల్లగొడుతుంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే ఈ సినిమా 500 కోట్లకు పైగానే కలెక్ట్ చేసి ప్రభాస్ స్టామినాను మారుమారు నిరూపించింది. 'సలార్' హిట్‌తో ప్రభాస్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
బాహుబలి తరువాత ప్రభాస్‌కు ఆ రేంజ్ హిట్ దక్కడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 'సలార్' సూపర్ హిట్ అవ్వడంతో..మరోమారు నేషనల్ లేవల్లో ప్రభాస్ గురించి చర్చ నడుస్తుంది. ఇదే సమయంలో ప్రభాస్ పెళ్లి గురించి విపరీతమైన చర్చ సాగుతుంది. ప్రభాస్ ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటారా అని ఆయన అభిమానులతో పాటు, కుటుంబ సభ్యులు కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు.

ఆ మధ్య హీరోయిన్ అనుష్క ప్రభాస్‌ల గురించి అనేక రూమార్స్ హల్ చల్ చేశాయి. అనుష్క అయితేనే ప్రభాస్‌కు జోడీగా బాగుంటుందని అభిమానులు కూడా కోరుకున్నారు. కానీ తామిద్దరం కేవలం స్నేహితులం మాత్రమే అని పలుమార్లు ఈ జంట క్లారిటీ ఇచ్చారు. దాంతో ఈ రుమార్లకు చెక్ పెట్టినట్టు అయింది. తాజాగా ప్రభాస్ పెళ్లి గురించి కృష్ణంరాజు భార్య , ప్రభాస్ పెద్దమ్మ శ్యామల దేవి స్పందించారు.

వచ్చే ఏడాదిలో కచ్చింతంగా ప్రభాస్ పెళ్లి ఉంటుందని ఆమె తెలిపారు. అయితే ప్రభాస్ మరదలంటూ ఓ అమ్మాయి ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్య్వూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్య్వూలో మీరు ప్రభాస్ మరదలే కదా.. ప్రభాస్ పుట్టిన రోజు నాడు మీరు హ్యాపీ బర్త్ డే బావా అని కూడా ఆయనకు మెసేజ్ చేశారు కదా అంటూ ఆమెను యాంకర్ ప్రశ్నించాడు.
ఈ విషయం మీకు ఎలా తెలుసు..అలాంటిది ఏమీ లేదని.. తాను కేవలం వాట్సాప్ స్టేటస్‌లో ప్రభాస్ గారి ఫొటో పెట్టి హ్యాపీ బర్త్ డే బావా అని మాత్రమే రాశానని ఆమె తెలిపింది. ఆయనకు డైరెక్ట్‌గా పుట్టిన రోజు శుభాకాంక్షాలు చెప్పే ధైర్యం తనకు లేదని ఆమె చెప్పుకొచ్చింది. ప్రభాస్ నాకు బావ వరుసే అవుతారని.. కానీ కొంచెం దూరపు బంధువు అవుతారని అని ఆమె తెలిపింది. అయితే ఆమె పేరు కాని.. ఊరు కాని ఏ వివరాలు బయటకు రాలేదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.












Click it and Unblock the Notifications