హీరో సిద్ధార్థ్ మొదటి భార్యను ఎప్పుడైనా చూశారా..?

హీరో సిద్ధార్థ్‌కు ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉండేది. బాయ్స్ సినిమాతో హీరోగా పరిచియమైన సిద్ధార్థ్ అతి తక్కువ కాలంలోనే లవర్ బాయ్ ట్యాగ్‌ను సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా తెలుగులో బ్యాక్ బ్యాక్ హిట్లను కొట్టి స్టార్ హీరోగా మారాడు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా ,చుక్కల్లో చంద్రుడు, బొమ్మరిల్లు,ఆట, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, ఓయ్ వంటి సినిమాలతో సిద్ధార్థ్‌ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తరువాత వరుస ఫ్లాపులు పలకరించడంతో తెలుగులో నటించడం మానేశాడు. సిద్ధార్థ్‌ ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితం అయ్యాడు.

తాజాగా హీరోయిన్ అదితిరావు హైదరీను సిద్ధార్థ్ సైలెంట్‌గా వివాహం చేసుకుని షాకిచ్చాడు. కొన్నాళ్లుగా వీరిద్దరు గాఢమైన ప్రేమలో ఉన్నారనే విషయం అందరికి తెలిసిందే. పెళ్లికి ముందే కాపురం పెట్టేసిన ఈ జంట.. తాజాగా వివాహంతో ఒకటైయ్యారు. ఇదిలా ఉంటే సిద్ధార్థ్‌కు ఇది రెండో వివాహం. అతనికి గతంలోనే ఓ పెళ్లి అయింది. 2003లో మేఘన అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న సిద్ధార్థ్‌ ఆమెతో ఇద్దరు పిల్లల్ని కన్నాడు. తరువాత మనస్పర్థల కారణంగా వీరిద్దరు విడిపోయారు. 2007లో మేఘనకు సిద్ధార్థ్ విడాకులిచ్చాడు.

Have you ever seen hero Siddharth s first wife

మేఘనతో విడిపోయిన తరువాత పలువురు హీరోయిన్లతో సిద్ధార్థ్ ఎఫైర్ నడిపాడు. కమల్ హాసన్ కూతురు శృతి హాసన్‌తో కొన్నాళ్లు డేటింగ్ చేసిన సిద్ధార్థ్.. ఆ తరువాత హీరోయిన్ సమంతతో కొంతకాలం రిలేషన్‌లో ఉన్నాడు. సమంత , సిద్ధార్థ్ వీరిద్దరు జబర్దస్త్ అనే సినిమాలో కలిసి నటించారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచియం ప్రేమగా మారింది. సమంతతో కలిసి సిద్దార్థ్ గుడిలో పూజలు నిర్వహించిన ఫొటోలు అప్పట్లో బాగానే వైరల్ అయ్యాయి. తరువాత వీరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తడంతో సిద్దార్థ్‌కు బ్రేకప్ చెప్పింది.

Have you ever seen hero Siddharth s first wife

అదితి రావు హైదరితో ప్రేమాయణం సాగించిన సిద్ధార్థ్..ఇప్పుడు ఆమెను వివాహం చేసుకున్నాడు. మహాసముద్రం సినిమాలో అధితి రావు హైదరి , సిద్ధార్థ్ కలిసి నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఏర్పడిన పరిచియం ప్రేమగా మారడంతో వీరిద్దరు కొన్నాళ్లు డేటింగ్ చేశారు. తాజాగా తమ బంధాన్ని పెళ్లిగా మార్చుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్‌లోని రంగనాయక స్వామి ఆలయంలో బుధవారం ఉదయం సిద్ధార్థ్, అదితిరావు హైదరీ వివాహం చాలా సింపుల్‌గా జరిగిందని తెలుస్తోంది. అదితి రావు హైదరీకి సైతం ఇది రెండో పెళ్లి కావడం విశేషం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+