Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బుద్ది లేదు, జ్ఞానం లేదు.. అంగీ లేదు, లుంగీ లేదు.. ఇవేం దిక్కుమాలిన లిరిక్స్ !

తెలుగు భాషకు, తెలుగు సాహిత్యానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. నాటి నన్నయ్య, తిక్కన, ఎర్రప్రగడల కాలం నుంచి నేటి వరకు కూడా.. ప్రజల భావాలను సంస్కృతిని యాడ్ పట్టేలా నిలిచింది తెలుగు సాహిత్యం. ప్రేమ, విరహం, త్యాగం, భక్తి, సామాజిక స్పృహ ఇలా ప్రతీ భావనకి అక్షర రూపం ఇస్తూ వచ్చారు. జానపదం నుంచి ఆధునిక సాహిత్యం వరకూ తెలుగులో ఉన్న కళాత్మకత ప్రపంచాన్ని మంత్రముగ్ధం చేసింది.

మారుతున్న కాలానుగుణంగా సాహిత్యం విషయంలో ప్రజల ఇష్టాలకు, మారుతున్న అభిరుచికి అనుగుణంగా మార్పులు వస్తున్నాయి. ఆధునిక సంగీతం పేరుతో కనీసం సాహిత్యం అర్ధం కాకుండా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తోనే పాటలను నింపేస్తున్న వారు ఒక వైపు ఉంటే.. మరోవైపు తెలుగు పాటతో ఆస్కార్ అందుకున్న వారు కూడా ఉన్నారు. అంచెలంచెలుగా ఎదుగుతున్న తెలుగు సినీ పరిశ్రమ గడిచిన కొన్నేళ్లలో రీజనల్ స్థాయి నుంచి గ్లోబల్ స్థాయికి ఎదిగింది. భాషతో సంబంధం లేకుండా ప్రజలను అలరిస్తుంది. అయితే ఈ తరంలో కొన్ని పాటలు మాత్రం తెలుగు సాహిత్య విలువలను తుంగలో తొక్కుతూ విమర్శలు తీసుకొస్తున్నాయి.

heavy-trolling-on-ole-ole-song-from-raviteja-mass-jathara-movie

మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం "మాస్ జాతర". భాను భోగవరపు దర్శకత్వం వహించిన ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. రవితేజ 75 చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ మూవీని సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ, సాయి సౌజ‌న్య నిర్మిస్తున్నారు. తెలంగాణ నేప‌థ్యంలో సాగే కథాంశంతో ఈ సినిమా తెర‌కెక్కనున్నట్టు సమాచారం. అందులోనూ రవితేజ, శ్రీలీల కాంబినేషన్లో "ధమాకా" తర్వాత వస్తున్న చిత్రం కావడంతో మూవీపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఈ నేపధ్యంలోనే ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ 'ఓలే ఓలే' సాంగ్ ని లేటెస్ట్ గా రిలీజ్ చేశారు. ఇందులో రవితేజ, శ్రీలీల.. అదిరిపోయే స్టెప్పులతో అదరగొట్టారు. ఈ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ఉత్తరాంధ్ర యాసలో ఉన్న ఈ పాటకు లిరిక్స్‌ని భాస్కర్ యాదవ్ దాసరి లిరిక్స్ అందించారు. అయితే సాంగ్ లిరిక్స్ విషయంలో నెటిజన్లు మండిపడుతున్నారు. ఫోక్ సాంగ్ కదా అని నోటికొచ్చినవి అన్నీ రాసి దాన్నే పాటగా కంపోజ్ చేస్తే ఎలా అంటూ ఫైర్ అవుతున్నారు.

మరి ముఖ్యంగా ఈ పాటలో గుంట.. ఉంట.. పంట.. తింటా.. నీ అమ్మని.. అక్కని.. చెల్లిని.. పట్టుకుని.. బుద్ది లేదు..జానం లేదు..సిగ్గు లేదు..శరం లేదు.. అంటూ ఉన్న లిరిక్స్ ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవేం దిక్కుమాలిన లిరిక్స్ అంటూ సోషల్ మీడియా వేదికగా తిట్టిపోస్తున్నారు.

పల్లె పాటలు.. మనుషుల జీవన శైలిని వివరించే ఎన్నో గొప్ప జానపద పాటలని ఇప్పటికీ స్మరించుకుంటూనే ఉంటాం. కానీ ఈ తరహా వైఖరిని మాత్రం ఖచ్చితంగా వ్యతిరేకించాల్సిందేనని కామెంట్స్ చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+