హేమ కమిటీ రిపోర్ట్‌.. ర‌జ‌నీకాంత్‌తోస‌హా అగ్ర‌హీరోలంద‌రికీ గ‌ట్టిగా ఇచ్చిప‌డేసిన న‌టి రాధిక‌!

కేరళ ప్రభుత్వానికి జస్టిస్‌ హేమ కమిటీ మలయాళ చిత్ర పరిశ్రమలోని లైంగిక వేధింపులు, కాస్టింగ్ కౌచ్ గురించి ఇచ్చిన రిపోర్ట్‌పై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. ఇలాంటి స‌మ‌యంలో త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్ చేసిన వ్యాఖ్య‌ల‌పై సీనియ‌ర్ న‌టి రాధిక ఘాటుగా స్పందించారు. పెద్ద హీరోలు ఈ అంశంపై మాట్లాడితినే సినీ ప‌రిశ్ర‌మ‌లోని మ‌హిళ‌ల‌కు ధైర్యం ఉంటుంద‌ని, అది వారి బాధ్య‌త‌ని గుర్తు చేశారు.

నిజానికి కొద్ది రోజుల క్రితం చెన్నైలో జరిగిన ఓ ప్రెస్ మీట్‌లో సూపర్ స్టార్ రజనీకాంత్‌ను కొంద‌రు విలేక‌రులు హేమ కమిటీ రిపోర్ట్‌ గురించి అడిగారు. అయితే, ఆ క‌మిటీ గురించి తనకేమీ తెలియదని ఆయ‌న స‌మాధానం చెప్ప‌డం పెద్ద చ‌ర్చ‌కు దారి తీసింది. ర‌జ‌నీకి నిజంగానే క‌మిటీ రిపోర్ట్ విష‌యం తెలియ‌దా? లేక దాని గురించి మాట్లాడ‌క‌పోవ‌డానికి మ‌రేదైనా కార‌ణం ఉందా అన్న అనుమానాలు మొద‌లయ్యాయి. స‌రిగ్గా అలాంటి స‌మ‌యంలో రజనీ వ్యాఖ్యలపై కోలీవుడ్ సీనియర్ నటి రాధిక శరత్‌కుమార్ త‌న‌దైన శైలిలో స్పందించారు. అగ్ర‌న‌టీనటులు హేమ కమిటీ నివేదికపై మౌనం వహించడాన్ని తీవ్రంగా ఖండించారు.

Hema committee report Actress Radhika who gave hard to all the top heroes including Rajinikanth

రజలు తప్పుగా అర్థం చేసుకునే అవ‌కాశం

ర‌జ‌నీ కాంత్‌కు హేమ కమిటీ రిపోర్ట్‌ గురించి బ‌హుశా తెలియ‌క‌పోయి ఉండ‌వ‌చ్చు. తెలిసి ఉంటే క‌చ్చితంగా మాట్లాడేవార‌ని న‌మ్ముతున్నాను. అయితే, ఇలాంటి విషయం గురించి తెలుసుకోక‌పోవ‌డం, మౌనంగా ఉండిపోవ‌డం మ‌హిళా న‌టుల‌ను కృంగ‌దీసివిలా ఉంటాయి. మీ మౌనాన్ని ప్రజలు తప్పుగా అర్థం చేసుకునే అవ‌కాశం ఉంది. అగ్ర నటీనటులు ఈ విషయం గురించి మాట్లాడ‌డం వ‌ల్ల మహిళా నటులకు మాన‌సిక ధైర్యాన్ని ఇచ్చినవార‌వుతారు. వేధింపులకు గురైన నటీమణుల‌కు న్యాయం ద‌క్కుతుంద‌న్న ఆశ క‌లుగుతుంది. ప్రజలు సైతం ఈ అంశంపై మాట్లాడాల‌ని రాధిక కోరారు.

వారు కూడా సీరియ‌స్‌గా తీసుకోవాలి

అంతేకాదు, కోలీవుడ్ నుంచి రాజ‌కీయ ప్ర‌స్థానంలోకి అడుగుపెట్టి, స‌మాజం కోసం క‌ష్ట‌ప‌డుతున్న అగ్ర నటీనటులు కూడా ఈ అంశాన్ని సీరియ‌స్‌గా తీసుకోవాల‌ని రాధిక కోరారు. తోటి నటీమణుల బాధను అర్థం చేసుకొని వాళ్లకు మద్దతుగా నిల‌బ‌డాల్సిన స‌మ‌యం ఇదని రాధిక‌ గుర్తుచేశారు. న‌టి రాధిక‌ హేమ కమిటీ రిపోర్ట్‌పై స్పందిస్తూ మలయాళ చిత్ర పరిశ్రమలోనే కాదు.. చాలా ఇండస్ట్రీల్లో ఇలాంటి పరిస్థితులే ఉన్నాయని సంచ‌న‌ల వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. తాజాగా ర‌జ‌నీకాంత్ వ్యాఖ్య‌ల‌పై స్పందిస్తూ అగ్ర‌హిరోల‌కు త‌న‌దైన శైలిలో ఇచ్చిప‌డేశార‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా కామెంట్ల వ‌ర్షం కురుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+