ఇక్కడ కాంప్రమైజ్ అయ్యేవాళ్లకే అవకాశాలు వస్తాయి.. బాలీవుడ్ నటి..!
ఏ చిత్ర పరిశ్రమ చూసుకున్న ఆడవాళ్లకు వేధింపులు తప్పడం లేదు. ఇటీవల కాలంలో అటు మలయాళ ఇండస్ట్రీ, ఇటు తెలుగు ఇండస్ట్రీలో వేధింపులు ఎదుర్కొన్న మహిళలు బయటికొచ్చి కంప్లైట్‌లు చేస్తున్న సంగతి చూస్తునే ఉన్నాం. తాజాగా ఓ బాలీవుడ్ నటి తను ఇండస్ట్రీలో ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి సంచలన కామెంట్స్ చేసింది. ఆమె ఎవరో కాదు... 'మర్డర్' సినిమాతో బాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన నటి మల్లికా షెరావత్..
ఈ నటి అప్పట్లో ఎక్కువగా బోల్డ్ క్యారెక్టర్లు ఎక్కువగా చేసింది. ఒక్క బాలీవుడ్‌లోనే కాకుండా హలీవుడ్, కోలీవుడ్‌లో పలు చిత్రాలు చేసింది. తాజాగా ఈ నటి బాలీవుడ్‌లో ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి కొన్ని షాకింగ్ విషయాలు ప్రముఖ మీడియాకు చెప్పుకొచ్చింది. తను కూడా ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానంటూ సంచలన కామెంట్స్ ఇచ్చింది.
'నేను చాలా సినిమాల్లో బోల్డ్ క్యారెక్టర్లు చేశాను. అయితే, చాలామంది నేను బయట కూడా అలాగే ఉంటానేమో అని అనుకునేవాళ్లు.. చాలా మంది బాలీవుడ్ స్టార్స్ నన్ను రాత్రి హోటల్ కి రమ్మని పిలిచేవారు. ఇక్కడ ఎవరైతే తమ కంట్రోల్‌లో ఉంటారో, కాంప్రమైజ్ అయ్యి, వాళ్లు చెప్పినట్లు వింటారో.. వాళ్లకి మాత్రమే అవకాశాలు వస్తాయి.. నేను అలాంటిదాన్ని కాదు.. మీ కోరికలు తీర్చలేనని చెప్పేశాను..అందుకే నాతో పనిచేసేందుకు ఏ స్టార్ ఆసక్తి చూపించలేదు. వాళ్లు చెప్పినట్లు నేను కాంప్రమైజ్ అయ్యి ఉంటే, ఈ పాటికి స్టార్ హీరోయిన్ల జాబితాలో నా పేరుండేది అంటూ ఇండస్ట్రీలో తను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి నటి మల్లికా షెరావత్ చెప్పుకొచ్చారు.

వాళ్లే నన్ను వేధించారు..
అవకాశాల కోసం నన్ను, నేను దిగజార్చుకోవడం నాకు ఏ మాత్రం ఇష్టం లేదు. బాలీవుడ్‌లో స్టార్ హీరోల పక్కన నటించాలంటే వాళ్లు ఏం చెబితే అది చేయాలి. రాత్రి 3 గంటలకు ఫోన్ చేసి, ఇంటికి రమ్మని పిలిచేవారు. ఫోన్ వచ్చిన వెంటనే వాళ్ల గదికి వెళ్లాలి. ఆ సర్కిల్‌లో ఉంటేనే సినిమా అవకాశాలు వస్తాయి. లేదంటే సినిమా నుంచి తప్పించేస్తారు. బాలీవుడ్‌లో ఓ వర్గం, మీడియా నన్ను తీవ్రంగా అవమానించింది, వేధించింది. అలా వేధించిన వారిలో చాలా మంది ఆడవాళ్లే ఉన్నారు. ఇండస్ట్రీనీ వదిలి వెళ్లిపోయేలా నన్ను వేధించేవాళ్లు. నన్ను ఎందుకు అంతలా ఆస్యహించుకుంటున్నారో నాకు అర్థమయ్యేది కాదు. వాళ్ల వల్లే దేశం వదిలి వచ్చేశాను..అంటూ కామెంట్ చేసింది బాలీవుడ్ హీరోయిన్ మల్లికా షెరావత్..












Click it and Unblock the Notifications