ఫ్యాన్స్‌ని టచ్ చేస్తే ఊరుకోను.. బాలయ్య ఫైర్
టాలీవుడ్ స్టార్ హీరో, నందమూరి నటసింహం బాలకృష్ణకి సపరేట్ కి దేశ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన పని లేదు. నేడు బాలయ్య తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పుట్టిన రోజు వేడుకలను సెలబ్రేట్ చేస్తున్నారు. పలు చోట్ల అన్నదానం, రక్తదానం సహా పలు సామాజిక సేవా కార్యక్రమాలను సైతం నిర్వహిస్తున్నారు.
ప్రతి ఏటా తన బర్త్ డే వేడుకలను బసవతారకం హాస్పిటల్ లోనే జరుపుకుంటున్నారు బాలయ్య. క్యాన్సర్ పేషెంట్ల సమక్షంలో కేక్ కట్ చేసి స్వయంగా ఆయనే పిల్లలకు కేక్ తినిపిస్తారు. ఈరోజు కూడా హాస్పిటల్ కి వెళ్లిన బాలకృష్ణ.. అక్కడ తన తల్లిదండ్రుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆ తర్వాత హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న క్యాన్సర్ పేషెంట్లకు పండ్లను అందజేశారు. కేక్ కటింగ్ చేసి పిల్లలకు తినిపించారు.

ఈ క్రమంలోనే బాలయ్య పుట్టిన రోజు వేడుకలకు సంబంధించి ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే బాలకృష్ణతో ఫోటోలు దిగడానికి ఆస్పత్రి వద్దకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అభిమానులు ఒక్కసారిగా తోసుకొని రావడంతో ఆయన బౌన్సర్లు అభిమానులను పక్కకు నెట్టే ప్రయత్నం చేశారు.
ఫ్యాన్స్ ను టచ్ చెయ్యొద్దు..
అయితే బౌన్సర్లు అభిమానులను పక్కకు నెడుతున్న సమయంలో బాలయ్య తన బౌన్సర్లకు వార్నింగ్ ఇచ్చారు. ఫ్యాన్స్ ను టచ్ చెయ్యొద్దని చెప్పడంతో వారు సైతం వెనక్కయిబ్ తగ్గారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాంతో కొట్టిన బాలయ్యే.. పెట్టిన బాలయ్యే అంటూ ఫ్యాన్స్ ఎక్స్ వేదికగా కామెంట్స్ చేస్తూ ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు.
ఏయ్..... ఫ్యాన్స్‌ని నెట్టకండి.. బాలయ్య మాస్ వార్నింగ్.... 🔥🔥#Balakrishna #Akandha2 #HappyBirthdayNBK #Akhanda2Teaser #Akhanda2Thaandavam #NBKBirthdayMonth #nbkbirthday pic.twitter.com/1bnEoyyO3k
— TeluguOne (@Theteluguone) June 10, 2025
బాలయ్య సినిమాల విషయానికి వస్తే.. 'అఖండ' మూవీకి సీక్వెల్ గా అఖండ - 2 చిత్రంలో నటిస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో సంయుక్త హీరోయిన్ గా నటిస్తోంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దసరా కానుకగా సెప్టెంబర్ '5న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే వీరు కలిసి చేసిన సింహ, లెజెండ్, అఖండ చిత్రాలు భారీ హిట్స్ అందుకోగా.. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ యూట్యూబ్ లో దూసుకుపోతుంది.












Click it and Unblock the Notifications