సెంట్రల్ జైల్లో ఒకే సెల్ లో హీరో, హీరోయిన్ ?, అక్కడా వదల్లేదా, సీసీటీవీ క్లిప్పింగ్ లో ?
శ్యాండిల్ వుడ్ ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ తూగుదీప అలియాస్ దర్శన్ కొంతకాలం క్రితం అతని స్నేహితురాలు, నటి పవిత్ర గౌడకు అసభ్యకరమైన సందేశాలు పంపాడనే ఆరోపణలతో రేణుకాస్వామి అనే యువకుడిని హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. హత్యకేసులో నిందితులుగా పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఉన్న హీరో దర్శన్, నటి పవిత్ర గౌడ్ ఒకే సెల్ లో ఉన్నారని ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది.
బెంగళూరు నగర శివార్లలోని పరప్ప అగ్రహార సెంట్రల్ జైలులో హీరో దర్శన్, హీరోయిన్ పవిత్ర గౌడ ఒకే సెల్ లో కాలం గడుపుతున్నారని ఆరోపణలు రావడం కర్ణాటకలో తీవ్ర చర్చకు దారితీసింది. హత్య కేసులో అరెస్టు అయిన ఏ1 ఆరోపి పవిత్ర గౌడ, ఏ2 ఆరోపి హీరో దర్శన్ ఇద్దరూ సెంట్రల్ జైల్లో ఒకే గదిలో ఉన్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. డబ్బులు ఉంటే పరప్ప అగ్రహార జైలులో ఇలాంటి సాధ్యం అవుతాయని మరోసారి వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది.

పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఉన్న హీరో దర్శన్ కు అన్ని రకాల సేవలు, రాచమర్యాదలు అందుతున్నాయని గత మూడు వారాల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. పరప్ప అగ్రహార సెంట్రల్ జైలుపై ఆరోపణలు రావడం ఇప్పుడు కొత్తకాదు. పరప్పన అగ్రహార సెంట్రల్ జైల విషయంలో గతంలో ఐపీఎస్ అధికారి డి. రూప అనేక ఆరోపణలు చేశారు. కొన్ని సంవత్సరాల క్రితం పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఆకస్మికంగా సోదాలు చేసిన డి. రూప జైలులోని బ్యారెక్ ల్లో గంజాయి, గంజాయి, కత్తులు, చాకులు వంటి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
ఆ సందర్బంలో అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రాణస్నేహితురాలు శశికళ నటరాజన్ కు రాచమర్యాదలు అందుతున్నాయని ఐపీఎస్ అధికారిణి డి రూప ఆరోపణలు చెయ్యడం అప్పటి కర్ణాటక ప్రభుత్వాన్ని కుదిపేసింది. పరప్ప అగ్రహార జైలులో డబ్బులు చెల్లిస్తే ఏమైనా దొరుకుతుందన్న మాట నిజమైందని మరోసారి వెలుగు చూడటం ఇప్పుడు మరోసారి చర్చకు తెరలేపింది.

ఇప్పుడు నటి పవిత్ర గౌడ, హీరో దర్శన్‌లను ఒకే గదిలో ఉంచారని తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలు కూడా సంచలనం సృష్టించాయి. హీరో దర్శన్ ఇప్పుడు పరప్ప అగ్రహార సెంట్రల్ జైల్లో వీవీఐపీ సెల్‌లో ఉన్నట్లు సమాచారం. అందువల్ల పరప్ప అగ్రహారంలోని వీవీఐపీ జైలు గదులకు ప్రత్యేకమైన, అత్యాధునిక భద్రత ఉంది. అదే స్థలంలో సీసీటీవీ కెమెరాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు వినిపిస్తున్న ఆరోపణలపై విచారణ జరపాలంటే పరప్ప అగ్రహార సెంట్రల్ జైలులోని వీవీఐపీల గదుల సమీపంలో ఉన్న సీసీటీవీ కెమెరాలను ఉన్నతాధికారులు తనిఖీ చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications