ప్రైవేట్ పార్ట్ మీద దాడి చేసిన స్టార్ హీరో, హత్య చేసింది ఆ హీరోనే ?, చిక్కుల్లో డీ బాస్ !
నటుడు దర్శన్‌పై రోజురోజుకు ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. హత్యానేరంపై జైలులో ఉన్న కన్నడ స్టార్ హీరో దర్శన్‌పై కర్ణాటకలో నిరసనలు మొదలైనాయి. అదే సమయంలో మరో సంచలన ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వార్త విని కర్ణాటక మొత్తం షాక్ అయ్యింది. రేణుకాస్వామి హత్య కేసులో నటుడు దర్శన్ కు నేరుగానే ప్రమేయం ఉందా? ఛార్జ్ షీట్ లో ఏముంది అని ఇప్పుడు తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది
అంతకుముందు దర్శన్ భార్య విజయలక్ష్మి, నటి, హీరో దర్శన్ గర్ల్ ఫ్రెండ్ పవిత్ర గౌడల గొడవలు ఆ హీరోకు పెద్ద తలనొప్పి తెచ్చిపెట్టింది. దర్శన్, పవిత్ర గౌడ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని విజయలక్ష్మి ఆరోపించడంతో ఇద్దరి మద్య సోషల్ మీడియాలో పెద్ద వార్ జరిగింది. ఆ గొడవలు ప్రారంభమైనప్పుడు హీరో దర్శన్ అభిమానులు అసహనం వ్యక్తం చేశారు. అప్పుడు హత్యకు గురైన రేణుకాస్వామి నటి పవిత్ర గౌడపై చెడు వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు ఉన్నాయి.

.
నటి పవిత్రా గౌడ గురించి అనుచుతి వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేశాడని ఆరోపిస్తూ రేణుకాస్వామి మీద పవిత్రా గౌడ, దర్శన్ రగిలిపోవడంతో చివరికి అతని హత్యకు దారితీసింది. ఈ ఘటనలో దర్శన్‌పై హత్య ఆరోపణలు వచ్చాయి. రేణుకాస్వామిని హీరో దర్శన్ హత్య చేయించాడని ఇన్ని రోజులు ఆరోపణలు వచ్చాయి. రేణుకాస్వామి హత్యతో హీరో దర్శన్ ప్రమేయం ఉందంటూ తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో మరో కలకలం రేపే ఆరోపణలు బయటకు వచ్చాయి.
హీరో దర్శన్ చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి మర్మాంగాన్ని స్వయంగా తన్నాడని ఆరోపిస్తున్నారు. అలాగే రేణుకస్వామిని కర్రలతో చితకబాది అతని మర్మాంగాన్ని తన్ని దారుణంగా కొట్టి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైందని కన్నడ మీడియాలో వార్తలు రావడం కలకలం రేపుతోంది. రేణుకాస్వామి మర్మాంగానికి స్వయంగా దర్శన్ తన్నడం వలనే అతను చనిపోయాడని ఆరోపణలు వచ్చాయి. రేణుకాస్వామిని హీరో దర్శన్ హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఈ వార్త ఇప్పుడు పెను సంచలనం సృష్టించింది. హీరో దర్శన్ ఈగో గురించి మాట్లాడిన ప్రముఖ కన్నడ నిర్మాత ఉమాపతి శ్రీనివాస్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. జీవితంలో మనల్ని అందరూ మెచ్చుకోవాలి, ప్రతి ఒక్కరూ మనకు గౌరవం ఇవ్వాలి, అలా గౌరవం సంపాదించాలి. ఈ రోజు నేను సరిగ్గా లేకపోవచ్చు, కానీ జీవితం పైకి క్రిందికి వెళుతుంది అని ఉమాపతి చెప్పారు. ఇప్పుడు అదే తరహాలో నటుడు దర్శన్ కూడా హత్యకేసులో జైలు పాలయ్యాడు, ఉమాపతి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతోంది.
అలాగే దర్శన్ వ్యతిరేకులు నిర్మాత ఉమాపతి మాట్లాడిన వీడియోను షేర్ చేస్తూ నటుడు దర్శన్ హత్య కేసు గురించి మాట్లాడుతున్నారు. దర్శన్, పవిత్ర గౌడల సంబంధం గురించి రకరకాలుగా చర్చ జరుగుతోంది. ప్రతిరోజు మద్యం సేవించి ఎంజాయ్ చేస్తూ మాంసాహారం తిన్న నటుడు దర్శన్, అతని అనుచరులు ఇప్పుడు జైలులో అన్నం, సాంబార్ తిని చాప మీద పడుకునే పరిస్థితి వచ్చింది, దీనికంతటికి కారణం నటి పవిత్రా గౌడ అని దర్శన్ అభిమానులు అంటున్నారు. హీరో దర్శన్, నటి పవిత్రా గౌడతో పాటు హత్య కేసులో అరెస్టు అయిన అందరికి మూడు నెలల పాటు బెయిల్ కూడా రాదని న్యాయనిపుణులు అంటున్నారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications