ఆ హీరోయిన్‌తో నటించొద్దంటూ ఆ ఇద్దరి నుంచి గోపీచంద్‌కు వార్నింగ్

మ్యాచో స్టార్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు హీరో గోపీచంద్. కెరీర్ ప్రారంభంలో విలన్ గా నటించి మెప్పించారు. ఆయన విలనిజం హీరోకన్నా ధీటుగా ఉండటంతో గోపీచంద్ తో విలన్ గా చేయడానికి పలువురు దర్శక, నిర్మాతలు ఆసక్తి చూపించారు. తేజ దర్శకత్వంలో వచ్చిన జయం సినిమాలో తన విలనిజాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశాడు. తర్వాత నిజం, వర్షం చిత్రాల్లో కూడా ప్రతినాయకుడిగా నటించారు. ఆరడుగులకు పైగా ఉండే ఎత్తుతో హీరోలకు మించి ఎంతో శక్తివంతంగా గోపీచంద్ విలనిజం అద్భుతంగా పండేది.

జంట బాగుంటుందని అందరూ భావించారు
అటువంటి సమయంలో యజ్ఞం చిత్రంలో కథానాయకుడిగా అవకాశం రావడం, ఆ సినిమా విజయవంతం కావడంతో ఇక వెనుదిరిగి చూసుకోలేదు. ఇటీవల కాలంలో కొన్ని సినిమాలు ఆడకపోయినప్పటికీ ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో విశ్వం సినిమా చేస్తున్నారు. హీరో, దర్శకుడు ఇద్దరికీ ఈ సినిమా హిట్ కావడం ఎంతో అవసరం. గోపీచంద్ సినిమాల పేర్లు చివరన యజ్ఞం, రణం, లౌక్యం, లక్ష్యం, శౌర్యం.. ఇలా ఉంటాయి. దీనివల్ల ఆ సినిమా సూపర్ హిట్ అవుతుందనే సెంటిమెంట్ ఉంది. గోపీచంద్ లక్ష్యం, శౌర్యం సినిమాల్లో హీరోయిన్ గా అనుష్క నటించింది. ఆ రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. దీంతో ఈ జంట బాగుంటుందని దర్శక నిర్మాతలు వీరిద్దరితో సినిమాలు తీయడానికి ప్రయత్నించారు.

hero gopichand parents warning had did not act with heroine anushka

వారిద్దరిపై గుసగుసలు వినిపించాయి
వీరిద్దరిపై ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినపడ్డాయి. స్నేహం ఉందని చెప్పినప్పటికీ అందరూ విపరీతార్థాలు తీశారు. అటువంటి సమయంలోనే గోపీచంద్ కుటుంబ సభ్యులు కూడా అనుష్కతో సినిమా చేయడానికి ఒప్పుకోలేదు. ఆ అమ్మాయితో తిరిగితే కాళ్లు విరగ్గొడతామంటూ హెచ్చరించారు. అయినా సినీ పరిశ్రమలో ఇటువంటి రూమర్లు రావడం సహజమేనని, అటువంటివేమీ పట్టించుకోవద్దని చెప్పినప్పటికీ వారు వినలేదు. హీరో హీరోయిన్ల జంట బాగున్నారనుకుంటే ప్రేక్షకులు బాగా ఆదరిస్తారని, దీనివల్ల సినిమా విజయం సాధిస్తుందని చెబుతున్నప్పటికీ వారు వినకపోవడంతో చివరకు తన సినిమాల్లో అనుష్కను తీసుకోవడం గోపీచంద్ మానేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+