వైఎస్ జగన్‌పై గోపీచంద్ సెటైర్లు.. 'విశ్వం' టీజర్ సంచలనం
మ్యాచోస్టార్ గోపీచంద్ ఒకప్పుడు వరుసగా హిట్లు కొడుతూ స్టార్ లీగ్ లో ఉన్నారు. అయితే ఆ తర్వాత కొన్ని ఫ్లాపులు పడ్డాయి. అడపా దడపా విజయాలు దక్కినప్పటికీ క్రేజ్ క్రమేణా తగ్గుతూ వచ్చింది. సరైన్ హిట్ కోసం కొన్ని సంవత్సరాలుగా గోపీచంద్ ఎదురుచూస్తున్నాడు. మార్కెట్ పెంచుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాడు. భారీ అంచనాల మధ్య నిర్మాణం జరుపుకుంటున్న సినిమాలన్నీ బోల్తా కొడుతున్నాయి. ఇటువంటి తరుణంలో శ్రీను వైట్ల దర్శకత్వంలో విశ్వం సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా అటు శ్రీను వైట్లకు, ఇటు గోపీచంద్ కు ఎంతో కీలకం.
గోపీచంద్ యాక్షన్ శ్రీను వైట్ల కామెడీ
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదలవగా దీనికి మంచి స్పందన వస్తోంది. గోపీచంద్ తరహా యాక్షన్ తోపాటు శ్రీను వైట్ల తరహాలో కామెడీని కూడా మిక్స్ చేసి ఈ సినిమాను తెరకెక్కించినట్లు టీజర్ ను బట్టి అర్థమవుతోంది. శ్రీనువైట్ల గతంలో తాను తీసిని ప్రతి సినిమాలో ఎవరో ఒక టాప్ సెలబ్రిటీపై పంచులు వేయడం ఆనవాయితీ. అందుకు తగ్గట్లుగా క్యారెక్టర్ ను క్రియేట్ చేయడంతోపాటు డైలాగులు కూడా రాస్తాడు. సరిగ్గా విశ్వం సినిమాలో కూడా ఇలాగే చేశాడు.

కొట్టారు తీసుకున్నాం..
'కొట్టారు తీసుకున్నాం..రేపు మాకు కూడా టైం వస్తుంది..మేము కూడా కొడతాం' అనే డైలాగ్ టీజర్ లో ఉంది. 2014 ఏపీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమిపాలైంది. అప్పుడు జరిగిన మీడియా సమావేశంలో జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదో ఒక సందర్భంలో ఈ వ్యాఖ్యలు ట్రెండింగ్ లోనే నిలుస్తుంటాయి. ప్రస్తుతం ఈ డైలాగ్ సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. సాధారణంగా సినిమాలో సందర్భానుసారం ఈ డైలాగును వాడుకున్నారా? లేదంటే వైఎస్ జగన్ పై సెటైర్ వేశారా? అనేది సినిమా విడుదలైతేకానీ ఒక స్పష్టత రాదు. ప్రస్తుతం ఇది తెలుగు ఫిలింనగర్ లో చర్చనీయాంశంగా మారింది. గత ఐదు సంవత్సరాల్లో చిత్ర పరిశ్రమను పూర్తిగా పట్టించుకోని జగన్ పై ప్రస్తుతం సెలబ్రిటీలంతా తమ కోపాన్ని బయటపెడుతున్నారు. ఆకోవలేనే శ్రీను వైట్ల ప్రయత్నం చేశాడా? లేదా? అనేది సినిమా విడుదలైన తర్వాతే తెలవనుంది.












Click it and Unblock the Notifications