ఏపీ రాజకీయాల్లో మంట పెట్టిన జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్?
నందమూరి కుటుంబంలో విభేదాలున్నాయనే సంగతి అందరికీ తెలిసిందే. ప్రధానంగా జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ఒక జట్టుగా ఉంటున్నారు. మిగతావారు మరో జట్టుగా ఉంటున్నారు. నందమూరి బాలకృష్ణ మాత్రం అవకాశం దొరికినప్పుడల్లా పరోక్షంగా జూనియర్ ఎన్టీఆర్ పై విరుచుకుపడుతున్నారు. అయితే బాలయ్యకు మాత్రం తారక్ కానీ, కల్యాణ్ రామ్ కానీ ఎప్పుడూ కౌంటర్ ఇవ్వలేదు.
సినిమాలపైనే దృష్టి
ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా నివాళులర్పించడానికి వెళ్లిన బాలయ్య అక్కడున్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తీయించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి సినిమాలపైనే దృష్టి పెట్టిన ఎన్టీఆర్ జాగ్రత్తగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ఈరోజు స్వర్గీయ నందమూరి తారకమారావు జయంతి కావడంతో ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి కుటుంబ సభ్యులంతా నివాళులర్పించారు. జూనియర్ ఎన్టీఆర్ నివాళుర్పించే సమయంలో అక్కడున్నవారంతా సీఎం, సీఎం, సీఎం అంటూ నినాదాలు చేశారు.

తెలుగుదేశం చిన్నపోతోంది
ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని తారక్ చేసిన ట్వీట్ పరోక్షంగా తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి చేసినట్లుగా ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. "మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది.. మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది.. పెద్దమనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా.." అంటూ ట్వీట్ చేశాడు తారక్. అయితే దాన్ని కొందరు నెటిజన్లు మరోరకంగా మారుస్తున్నారు. తెలుగుదేశం చిన్నపోతోంది.. పెద్ద మనసుతో మళ్లీ రా తాతా.. అన్నట్లుగా మార్చి కామెంట్లు పెట్టడం, మార్చిన పదాలను ట్వీట్ చేయడం చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తో నందమూరి కుటుంబ సభ్యుల అనుబంధం అసలే అంతంతమాత్రంగా ఉంటుంటే కొడాలి నాని, వల్లభనేని వంశీలాంటివారు చంద్రబాబు, భువనేశ్వరి, లోకేష్, బాలయ్యపై చేసిన వ్యాఖ్యలు మరింత దూరం పెంచుతున్నాయి. ఎందుకంటే వారిని తారక్ నియంత్రించగలడనేది వారి అభిప్రాయం. కానీ అలా చేయడంలేదు అని నందమూరి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications