బుద్ధుందా నీకు.. ఒక్కసారిగా అతనిపై ఫైర్ అయిన కల్యాణ్ రామ్
నందమూరి హీరో కల్యాణ్ రామ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. హీరోగా, నిర్మాతగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్నిక్రియేట్ చేసుకున్నారు. అయితే హీరోగా కల్యాణ్ రామ్ అనుకున్నంత సక్సెస్ కాలేకపోయారు. అతనొక్కడే,పటాస్ , డేవిల్, 118, బింబిసార వంటి హిట్ చిత్రాలు కల్యాణ్ రామ్ ఖాతాలో ఉన్నాయి. ఆయన తాజాగా నటించిన చిత్రం 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి'. ఈ సినిమాలో సీనియర్ నటి, ఎమ్మెల్సీ విజయశాంతి కీలక పాత్రలో కనిపిస్తున్నారు.
సినిమా విడుదల దగ్గర పడటంతో చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు. దీనిలో భాగంగానే ట్రైలర్ ఈవెంట్‌లో అనూహ్య సంఘటన ఒకటి చోటు చేసుకుంది. స్టేజీపై విజయశాంతి మాట్లాడి వెళ్లిపోతారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఫొటోగ్రాఫర్ విజయశాంతిని ఫొటోలు తీయడానికి ప్రయత్నించగా, పక్కనే ఉన్న సెక్యూరిటీ గార్డు ఆ ఫొటోగ్రాఫర్‌ను గట్టిగా వెనక్కి లాగేస్తాడు.ఇది చూసిన హీరో కల్యాణ్ రామ్ వెంటనే అలెర్ట్ అయి సదరు సెక్యూరిటీ గార్డును హెచ్చరిస్తాడు. ఏం చేస్తున్నావ్ అంటూ ఒకింత ఆ బాడీగార్డుపై ఆగ్రహం వ్యక్తం చేస్తారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో కల్యాణ్ రామ్ ఎంత మంచోడు అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

మరికొందరు కూల్‌గా ఉండే కల్యాణ్ రామ్‌కు కూడా కోపం వచ్చిందంటే అతను ఎంత పెద్ద తప్పు చేశాడో అర్థం చేసుకోవచ్చంటూ రియాక్ట్ అవుతున్నారు.ఇక 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సినిమా బ్లాక్ బ్లాస్టర్ హిట్ కావాలని ఆయన ఈ సందర్భంగా కోరుకున్నారు.ఈ సినిమాలో సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈనెల 18న విడుదల కానుంది.












Click it and Unblock the Notifications