హైడ్రా కమీషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలపై కేసు!

హైదరాబాద్లోని ప్రైవేట్ కళాశాలలు హైడ్రో కమిషనర్ ఏవి రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేయడం ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్లోని ప్రైవేట్ జూనియర్ కళాశాలలు తెలంగాణ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డు సమర్పించిన నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్లలో హైడ్రా కమీషనర్ ఏవి రంగనాథ్ సంతకాలు ఫోర్జరీ చేశారు. ఈ నకిలీ పత్రాలతో వారు తెలంగాణ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డు నుండి గుర్తింపు పొందారు.

ఎనిమిది ప్రైవేట్ జూనియర్ కాలేజీలపై ఫిర్యాదు

ఇక ఈ విషయాన్ని గుర్తించి చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు. మొత్తం ఎనిమిది కాలేజీలు హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసినట్టు ఎనిమిది కాలేజీలపైన లేక్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రైవేట్ కళాశాలలు ప్రతి సంవత్సరం ఇంటర్మీడియట్ బోర్డు నుండి గుర్తింపు పొందాలంటే ఆ కళాశాలలో అన్ని నిబంధనల ప్రకారం ఉన్నట్టు సంబంధిత సర్టిఫికెట్లను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

HYDRA commissioner signature forgery Eight private junior colleges in Hyderabad booked for forging AV Ranganath s signature

హైడ్రా కమీషనర్ రంగనాథ్ పేరుతో ఫోర్జరీ చేసిన నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ లు

ఇందులోని ఫైర్ సేఫ్టీ కి సంబంధించిన నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ కూడా ఉంటుంది. ఈ నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ ను హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఆయనకు తెలియకుండా ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేసి కొన్ని కాలేజీలు ఈ సర్టిఫికెట్ ను ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డుకు పంపించినట్టు గుర్తించారు.

ఎనిమిది కాలేజీలను ఫోర్జరీ చేసి నకిలీ ఎన్వోసీ తీసుకున్నట్టు గుర్తింపు

బర్కత్ పురాలోని హైందవి కాలేజ్, ఎస్సార్ నగర్ లోని రెసోనెన్స్, మెహదీపట్నంలోని ప్రియాంక కాలేజ్, విద్యానగర్లోని మదర్ గర్ల్స్, చంద్రాయణ గుట్ట శ్రీ చైతన్య, చిక్కడపల్లి న్యూ ఎరా, శివరాంపల్లి లోని షాహీన్, తెల్లాపూర్ లోని వశిష్ట కాలేజీలు ఇప్పటివరకు హైడ్రా కమిషనర్ రంగనాథ సంతకం ఫోర్జరీ చేసి నకిలీ ఎన్వోసీ తీసుకున్నట్టుగా గుర్తించారు.

బర్కత్ పురా కాలేజ్ నకిలీ సర్టిఫికెట్ వ్యవహారంతో బయటకు వచ్చిన ఫోర్జరీ స్కాం

2026 ఫిబ్రవరి 26వ తేదీన బర్కత్పురా లోని ఒక కాలేజీ నకిలీ ఫైర్ ఎన్ఓసి సమర్పించినట్టు ఫిర్యాదు రావడంతో మొత్తం మోసం బయటకు వచ్చింది. హైడ్రా అధికారిక రికార్డులను పరిశీలించగా ఆ సర్టిఫికెట్ తాము జారీ చేసింది కాదని తేలింది. దీంతో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాలో ఇంటర్ ఎడ్యుకేషన్ అధికారులకు సమర్పించిన 60 ఫైర్ ఎన్ఓసి లను పరిశీలిస్తున్నారు.

 వరంగల్ లో రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద ప్రభుత్వ క్యాన్సర్ హాస్పిటల్‌.. మంత్రి ప్రకటన!
వరంగల్ లో రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద ప్రభుత్వ క్యాన్సర్ హాస్పిటల్‌.. మంత్రి ప్రకటన!

60 పైగా కళాశాలల డాక్యుమెంట్ల వెరిఫికేషన్

ప్రస్తుతానికి ఎనిమిది కాలేజీలు గుర్తించగా, ఇంకా ఫోర్జరీ ఎన్ఓసీలు సబ్మిట్ చేసిన కాలేజీలు కూడా ఉన్నట్టు భావిస్తున్నారు. 60 పైగా కళాశాలల డాక్యుమెంట్ల వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఫైర్ ఎన్వోసీ లేకుండా ఇంటర్ బోర్డు గుర్తింపు పొందడం సాధ్యం కాదు. దీంతో కొన్ని మధ్యవర్తి సంస్థలు, ఒక అధికారి లక్షల రూపాయలు వసూలు చేసి ఎన్వోసీ లు తయారుచేసి ప్రైవేటు జూనియర్ కళాశాలలకు విక్రయించినట్లు తెలుస్తోంది. దీనిపైన ప్రస్తుతం పోలీసులు, హైడ్రా అధికారులు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+