Saturday Bank Holiday: ప్రతీ శనివారం ప్రభుత్వ బ్యాంకులకు సెలవు ? తేల్చేసిన కేంద్రం..!

దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు తాజాగా మూడు రోజుల సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ సమ్మె చివరి నిమిషంలో వాయిదా పడింది. అయితే ఈ సమ్మెకు ప్రధాన కారణం బ్యాంక్ ఉద్యోగులు ఐదు రోజుల పని దినాలు కోరుతుండటమే. ఇప్పటికే ప్రతీ నెలా నాలుగు ఆదివారాలతో పాటు రెండో, నాలుగో శనివారాలు కూడా బ్యాంకులకు సెలవు దినాలున్నాయి. ఇప్పుడు ఆ మిగిలిన రెండు శనివారాలు కూడా సెలవు ఇవ్వాలన్న బ్యాంక్ ఉద్యోగుల డిమాండ్ ను కేంద్రం అంగీకరించలేదు.

మచిలీపట్నం నుంచి కర్నూలుకు కొత్త రైలు-కేంద్రం ఆమోదం- హాల్ట్ లు ఇవే..!
మచిలీపట్నం నుంచి కర్నూలుకు కొత్త రైలు-కేంద్రం ఆమోదం- హాల్ట్ లు ఇవే..!

అయితే కేంద్రం బ్యాంక్ ఉద్యోగులతో జరిపిన చర్చల తర్వాత వారు మూడు రోజుల సమ్మెను వాయిదా వేసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రతీ శనివారం ప్రభుత్వ రంగ బ్యాంకులకు సెలవు (Saturday Bank Holiday) ప్రకటిస్తూ కేంద్రం ఓ నిర్ణయం తీసుకున్నట్లు, ఈ మేరకు ఆర్దిక శాఖ ఓ గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. ఆర్ధిక శాఖ పేరుతో జారీ చేసినట్లు ఉన్న ఆ గెజిట్ నోటిఫికేషన్ కూడా వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ద్వారా వివరణ ఇచ్చింది.

Saturday Bank Holiday for SBI Public Sector Banks PIB Fact Check Calls Viral Gazette Fake
ఏపీలో పింఛన్ దారులకు అలర్ట్..! బ్యాంకుల సమ్మె కారణంగా ఈసారి..!
ఏపీలో పింఛన్ దారులకు అలర్ట్..! బ్యాంకుల సమ్మె కారణంగా ఈసారి..!

అయితే ఈ వైరల్ గెజిట్ నోటిఫికేషన్ నకిలీదని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ లో స్పష్టం చేసింది. ప్రతి శనివారం ప్రభుత్వ రంగ బ్యాంకులకు సెలవు ప్రకటిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎలాంటి నోటిఫికేషన్ జారీ చేయలేదని తెలిపింది. అందువల్ల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ గెజిట్‌ను చూసి ప్రతి శనివారం ఎస్బీఐ, ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులు మూసి ఉంటాయని భావించవద్దని కేంద్రం తెలిపింది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అనుమానాస్పద సమాచారం లేదా పత్రాలు సోషల్ మీడియాలో కనిపిస్తే వాటిని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కు ఫ్లాగ్ చేయాలని కోరుతోంది. ముఖ్యంగా వైరల్ అవుతున్న గెజిట్ ఆధారంగా బ్యాంకుల సెలవులపై నిర్ణయం తీసుకోకుండా, అధికారిక ప్రభుత్వ ప్రకటనలు లేదా బ్యాంకుల అధికారిక సమాచారాన్ని మాత్రమే ఆధారంగా చేసుకోవాలని కేంద్రం సూచించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+