BRS ఎమ్మెల్సీ అభ్యర్ధులు ఖరారు..!?

తెలంగాణలో ఎన్నికల జాతర ప్రారంభం కానుంది. రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. పార్టీలన్నీ ఈ ఎన్నికలపై ప్రత్యేకంగా దృష్టి సారించాయి. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్, వరంగల్-ఖమ్మం-నల్గొండ ఎమ్మెల్సీ స్థానాలకు జరగబోయే ఎన్నికలను సెమీ ఫైనల్స్ గా భావిస్తున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తన అభ్యర్ధులను ప్రకటించింది. బీఆర్ఎస్ కూడా అభ్యర్థుల ఖరారు పైన ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ ముఖ్య నేతల సమావేశంలో కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. బీఆర్ఎస్ ఈ ఎన్నిక ల్లో అభ్యర్ధుల ఖరారు పైన కసరత్తు చేస్తోంది. కాంగ్రెస్ నుంచి ఇప్పటికే అభ్యర్ధులను ప్రకటించగా.. కేసీఆర్ పార్టీ ముఖ్యులతో మంత్రాంగం సాగిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ వాణీదేవి ఈ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకుంటూ అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. వరంగల్-ఖమ్మం-నల్గొండ స్థానానికి 'రెడ్డి' సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని, అలాగే హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ స్థానానికి 'బీసీ' అభ్యర్థిని బరిలో దింపాలని గులాబీ నాయకత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం. వరంగల్-ఖమ్మం-నల్గొండ నియోజకవర్గంలో పార్టీని పటిష్టం చేసే బాధ్యతను అనుగుల రాకేష్ రెడ్డికి అప్పగించింది. ఇప్పటి కే క్షేత్ర స్థాయిలో ఎన్నికల కార్యాచరణ ప్రారంభించారు.

ఖైరతాబాద్ ఉప ఎన్నిక నిర్వహించటానికి వీళ్లేదు, బిగ్ ట్విస్ట్...!!
ఖైరతాబాద్ ఉప ఎన్నిక నిర్వహించటానికి వీళ్లేదు, బిగ్ ట్విస్ట్...!!
brs-takes-strategic-steps-in-selecting-candidates-for-two-telangana-graduate-mlc-seats

కేసీఆర్ కీలక నిర్ణయాలు

కాగా.. రాకేష్ రెడ్డి గతంలో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఆయన గట్టిగా ఫైట్ చేస్తున్నారు. అదే విధంగా హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ స్థానం కోసం బీసీ అభ్యర్థిని పరిశీలిస్తోంది. కాసాని వీరేశ్ ముదిరాజ్, జి. నాగేందర్ గౌడ్, రవీందర్ యాదవ్ తదితరుల పేర్ రేసులో ఉన్నాయి. ఆయన ఇప్పటికే పలు ప్రాంతాల్లో పట్ట భద్రుల నమోదు కార్యక్రమాలను ముమ్మరం చేశారు. వికారాబాద్ కు చెందిన మాజీ కార్పొరేషన్ చైర్మన్ జి. నాగేందర్ గౌడ్ పేరును కూడా పార్టీ పరిశీలిస్తోంది. కాంగ్రెస్ కు చెక్ పెట్టే విధంగా బీఆర్ఎస్ అభ్యర్ధుల పై కసరత్తు చేస్తోంది. అందుకే ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల కు ముందు జరిగే ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికలను సెమీస్ గా భావిస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో అభ్యర్ధులను అధికారికంగా ప్రకటించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+