డీలిమిటేషన్ పై ఊహించని నిర్ణయం, మారుతున్న లెక్కలు- ఇక నెక్స్ట్.!!
పార్లమెంట్ కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జాతీయ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. జంతర్ మంతర్ వద్ద జెన్ జీ నిరసనలు.. తాజా ఉప ఎన్నికల్లోనూ ప్రశాంత్ కిషోర్ తో కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. పార్లమెంట్ సమావేశాల్లో విపక్షాలు తమ డిమాండ్ల కోసం పట్టుబడుతున్నాయి. కాగా.. ఈ సమావేశాల్లోనే మహిళా రిజర్వేషన్లు - డీలిమిటేషన్ బిల్లులను ఆమోదించాలని ప్రభుత్వం వ్యూహాలు సిద్దం చేసింది. మారుతున్న సమీకరణాల వేళ కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ నిర్ణయం రాజకీయంగా ఆసక్తిగా మారుతోంది.
జాతీయ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. జెన్ జీ నిరసనలతో ఢిల్లీ హోరెత్తింది. దీంతో, జాతీయ స్థాయిలో రాజకీయంగా కొత్త లెక్కలు తెర మీదకు వచ్చాయి. దీనికి కొనసాగింపుగా తాజాగా బీహార్ లో ఊహంచని విధంగా బంకీపూర్ లో ప్రశాంత్ కిషోర్ విజయం కేంద్రంలోని ప్రభుత్వానికి మరింత సంకటంగా మారింది. దీంతో.. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనే కేంద్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లులను ప్రవేశ పెట్టి.. ఆమోదించేలా వ్యూహాలు సిద్దం చేసింది. శివసేన (థాకరే), టీఎంసీ, ఆప్ నుంచి చీలిక వర్గం ఎంపీ ల మద్దతుతో బిల్లును ఆమోదించేలా బీజేపీ ముఖ్య నేతలు ప్రణాళికలతో సిద్దమయ్యారు. ఇండి కూటమి కీలక నేత శరద్‌పవార్‌తో ప్రధాని మోదీ ఇటీవల భేటీ కావటం వంటి పరిణామాలు.. ఈ బిల్లుల ఆమోదానికి అవసరమైన బలాన్ని ఎన్‌డీఏ సమకూర్చుకుంటుందన్న వాతావరణాన్ని సృష్టించాయి.

కేంద్రంలో మారుతున్న సమీకరణాలు
అయితే, అనూహ్యంగా ఆవిర్భవించిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) సారథ్యంలో జరిగిన జెన్‌జీ ఉద్యమం, కేంద్రమంత్రి ధర్మేంద్రప్రధాన్ రాజీనామాతో కేంద్రం అంచనాలు తప్పాయి. కాగా.. మారుతున్న రాజకీయ లెక్కల వేళ కేంద్రం ఆలోచన మారినట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులను ముందుకు తీసుకెళ్లటం కష్టమని, ప్రస్తుతానికి పక్కనపెట్టాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. కాగా, ఇదే సమయంలో వికసిత్ భారత్ శిక్షా అధిష్ఠాన్, ఎఫ్‌సీఆర్‌ఐ బిల్లులను కూడా ప్రభుత్వం వాయిదా వేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. మరో వైపు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేసారు. పార్లమెంట్‌లో డీలిమిటేషన్ బిల్లు తెచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని చెప్పుకొచ్చారు. డీలిమిటేషన్‌కు మద్దతు ఇస్తే చరిత్ర ద్రోహులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. దీంతో.. అసలు 2029 నాటికి డీలిమిటేషన్ పూర్తవుతుందా లేదా అనేది సందేహంగా మారుతోంది.













Click it and Unblock the Notifications