నీకు యాక్టింగ్ అవసరమా అంటూ వారు హేళన చేశారు - కల్యాణ్ రామ్
హీరో నందమూరి కల్యాణ్ రామ్ డెవిల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ నెల 29న ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. సినిమా ప్రమోషన్‌లో భాగంగా కల్యాణ్ రామ్ ఓ షోలో మాట్లాడుతూ సినిమా విశేషాలతో పాటు, గతంలో తనకు ఎదురైన అనుభవాల గురించి కూడా అభిమానులతో పంచుకున్నారు.
తాను హీరోగా చేస్తానని చెప్పినప్పుడు నాన్నగారు(హరికృష్ణ) ఎటువంటి అభ్యంతరం చెప్పలేదని..దీంతో ఈజీగానే ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చానని కల్యాణ్ రామ్ తెలిపారు. అయితే తొలి చూపులోనే , అభిమాన్యు సినిమాలు ఫ్లాప్ కావడంతో... కొంతమంది నీకు నటన అవసరమా..? యాక్టింగ్ మానేయ్ అంటూ సలహాలిచ్చారు.కానీ నాన్నగారు(హరికృష్ణ) ఎప్పుడూ నిరుత్సాహ పరచలేదు. నీకు ఏది అనిపిస్తే అది చేయమని ప్రోత్సహించారని కల్యాణ్ రామ్ చెప్పుకొచ్చారు.

ఆ తరువాత కల్యాణ్ రామ్ సొంత ప్రొడక్షన్ హౌస్ స్థాపించి వరుస హిట్లను తన ఖాతాలో వేసుకున్నారు. ఆయన తాజాగా నటించిన డెవిల్ చిత్రం విడుదలకు సిద్దం అవుతుంది. ఇటీవల విడుదలైన డెవిల్ మూవీ ట్రైలర్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. పీరియాడిక్ జోనర్‌లో తెరకెక్కిన ఈ చిత్రం ఆడియెన్స్‌కి ఓ సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వడం ఖాయమని కల్యాణ్ రామ్ తెలిపారు. ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించింది. మరి డెవిల్ సినిమా కల్యాణ్ రామ్ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.












Click it and Unblock the Notifications