చిరంజీవి సినిమాల్లో మహేష్‌బాబుకు నచ్చినవి రెండే
తెలుగు సినీ పరిశ్రమలో దాదాపు నాలుగు దశాబ్దాల నుంచి అగ్ర కథానాయకుడిగా చెలామణి అవుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఏడాదికొకటి కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ఉండాల్సిందే. ప్రస్తుతం పరిశ్రమలో స్టార్ హీరోలుగా రాణిస్తున్నవారిలో ఎంతోమంది చిరంజీవికి అభిమానులే. అందులో ప్రధానంగా చెప్పుకోదగిన హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. చాలా సందర్భాల్లో ఇంటర్వ్యూలిస్తూ తనకు చిరంజీవి సినిమాలంటే ఎంతో ఇష్టమనేవారు. అందులోను కొన్ని సినిమాలను రీమేక్ చేయాల్సివస్తే కచ్చితంగా తాను చేసే సినిమాలు రెండు ఉంటాయన్నారు.
రీమేక్ చేస్తే అవే చేస్తా
చిరు కెరీర్ లో ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు సినిమాలు సూపర్ స్టార్ కు బాగా నచ్చాయి. ఈ సినిమాల్లో చిరంజీవి మాస్ హీరోగా, మరోవైపు క్లాస్ హీరోగా మెప్పించారు. వాస్తవానికి రీమేక్ సినిమాలు చేయడానికి మహేష్ బాబు అంగీకరించరు. కానీ తన కెరీర్ లో రీమేక్ చేయాల్సి వస్తే ఈ రెండు సినిమాలు చేస్తానని స్వయంగా ప్రకటించారంటే అవి ఆయన్ను ఎంత ఆకట్టుకున్నాయో తెలిసిందే. పరిశ్రమలో చిరంజీవితో మహేష్ బాబు మొదటినుంచి ఎంతో సఖ్యతగా ఉండేవారు. తాను సూపర్ స్టార్ అయినప్పటికీ చిరంజీవి మెగాస్టార్ అనేవారు.

పాన్ వరల్డ్ హీరో అవుతున్నాడు
ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. సినిమాకు మేకోవర్ అయ్యేందుకు జర్మనీ వెళ్లి శిక్షణ తీసుకున్నారు. జర్మనీ నుంచి తిరిగివచ్చిన సమయంలో మహేష్ బాబు ఫొటోను చూసినవారంతా అచ్చెరువొందారు. అమ్మాయిల కలల రాకుమారుడుగా మహేష్ బాబు ఎందుకు పేరు వచ్చిందో వారందరికీ ఆ లుక్ చూసినప్పుడు అర్థమైంది. పూర్తిగా బయటకు కనపడకపోయినప్పటికీ తలపై టోపీ పెట్టుకొని, ముఖానికి మాస్క్ పెట్టుకొని మహేష్ బాబు కనిపించారు. కొందరు మాస్క్ లేకుండా ఉన్న సందర్భం తీసి ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. రాజమౌళితో చేసే సినిమాతో ప్రపంచ సినీ రంగంలో అగ్ర కథానాయకుడిగా మారతారని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications