సమంతను కలిసిన నాగచైతన్య?
తెలుగు సినీ పరిశ్రమలో నాగచైతన్య-సమంత జంట అందరినీ ఆకట్టుకుంది. అయితే వీరిద్దరూ విడిపోవడాన్ని కూడా అభిమానులెవరూ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. మళ్లీ కలవకపోతారా.. అంటూ ఆశతో ఎదురు చూసేవారు కూడా ఉన్నారు. మయోసైటిస్ వచ్చిన తర్వాత దానికి చికిత్స కోసం సమంత ఏడాది కాలం సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది.
ఇటీవలే అమెరికా, ఇటలీ, ఆస్ట్రియా దేశాల్లోని పర్యటనలను పూర్తిచేసుకుంది. తాను నిర్మాతల నుంచి అడ్వాన్స్ గా తీసుకున్న సొమ్ములు కూడా వెనక్కిచ్చేసింది. మరో ఏడాదిపాటు తమ అభిమాన తారను వెండితెరపై చూడలేకపోతున్నామనే బాధను ఫ్యాన్స్ వ్యక్తపరుస్తున్నారు. ఇటువంటి సమయంలోనే సమంతకు తోడు కావాలని, ఆ తోడే ధైర్యాన్ని కల్పించడంతోపాటు ఆత్మవిశ్వాసాన్నికూడా అందజేస్తుందనే చర్చ నెటిజన్ల మధ్య నడుస్తోంది.

తాజాగా ఒక విమానాశ్రమయంలో నాగచైతన్య-సమంత కలిసి వెళుతున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సమంతను మళ్లీ నాగచైతన్య కలిశాడంటూ వార్తలు వస్తున్నాయి. కలిస్తే తప్పేముంది? కలిసి సినిమాల్లో చేయకూడదా? మళ్లీ జీవితంలో కలిసిపోకూడదా? అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.
అయితే ఆ పొటో వారిద్దరికీ వివాహమైన కొత్తలోదని, పాత ఫొటోనే వైరల్ చేస్తూ వాళ్లిద్దరూ కలిశారంటూ వార్తను ప్రచారం చేస్తున్నారని తేలింది.
సమంత తన జీవితంలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత పెద్ద విజయాన్ని నాగచైతన్య సాధించలేకపోతున్నాడు. ఎప్పటికప్పుడు ఎంత ప్రయత్నిస్తున్నా సినిమాలు విజయవంతమవడంలేదు. విడిపోయిన తర్వాత తిరిగి కలవడం అంటే ఎంతో కష్టం. కొందరు మాత్రం నిజ జీవితంలో కలవకపోయినా పర్వాలేదు.. సినిమాల్లో కలిసి నటిస్తే చాలంటున్నారు. అభిమానుల ఆశ నెరవేరుతుందో? లేదో? చూద్దాం.












Click it and Unblock the Notifications